టాలీవుడ్ ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన తాజా చిత్రం జయ జానకి నాయక. యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్గా భారీ కాస్టింగ్, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వీరంగం ఆడుతోంది.
లై, నేనే రాజు నేనే మంత్రి సినిమాలతో పోటీగా ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది. తొలి రోజు 3.25 లక్షల షేర్ రాబట్టిన జయ జానకి నాయక రెండు రోజులకు ఏపీ+తెలంగాణలో 5.27 కోట్ల షేర్ రాబట్టింది. ఈ సినిమాకు ఈ రేంజ్లో వసూళ్లు రావడం వెనక బోయపాటి మాస్ సత్తాయే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
బీ, సీ సెంటర్లతో పాటు ఏ సెంటర్లలోను ఈ సినిమాకు మంచి వసూళ్లు రావడంతో పాటు రిపీటెడ్ ఆడియెన్స్ వస్తున్నారు. ఈ సినిమా రెండు రోజుల ఏరియా వైజ్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.
జయ జానకి నాయక 2 డేస్ ఏరియా వైజ్ షేర్
నైజాం – 1.55 కోట్లు
సీడెడ్- 0.90
ఉత్తరాంధ్ర – 0.79
ఈస్ట్ – 0.40
వెస్ట్ – 0.41
గుంటూరు – 0.63
కృష్ణా – 0.28
నెల్లూరు – 0.31
——————————————–
ఏపీ+తెలంగాణ షేర్ = 5.27 కోట్లు
——————————————