ఈటీవీలో ప్రసారమవుతోన్న జబర్దస్త్ షోను హైపర్ ఆది ఏలుతున్నాడు. జబర్దస్త్ షో ప్రసారమవుతోందంటే ఆది పంచ్‌ల కోసం ఆ ప్రోగ్రామ్ చూసేవాళ్లు లక్షల్లోనే ఉంటారు. ఇక కొద్ది రోజులుగా ఓ యువతితో ప్రేమలో మునిగి తేలుతున్న ఆది సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆది సీక్రెట్ పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏం వచ్చిందని ఆరా తీస్తే అసలు మ్యాటర్ బయటకు వచ్చింది.
ఆది పెళ్లి ఇరు వర్గాల పెద్దలకు ఇష్టం లేదట. దీంతో ఆదికి బాగా కావాల్సిన కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి జరిగినట్టు సమాచారం. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు మాత్రం ఆది ఫ్రెండ్స్ ద్వారా సోషల్ మీడియా నుంచి లీక్ అయ్యాయి. దీంతో ఇప్పుడు ఇవి వైరల్‌గా మారాయి. ఫొటోలు బయటకు రావడంతో ఆది పెళ్లి జరిగినట్టు కన్ఫార్మ్ అవుతోంది.
ప్రకాశం జిల్లాకు చెందిన ఆది బుల్లితెర మీద కమెడియన్‌గా బాగా పాపులర్ అయ్యాడు. ఈ క్రమంలోనే ఓ యువతితో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయాడట. వీరు పెళ్లి చేసుకుంటామని చెప్పినా కూడా ఇరు వైపులా పెద్దల నుంచి సుముఖత వ్యక్తం కాకపోవడంతో ఆది తన స్నేహితుల సమక్షంలోనే ఆ యువతిని పెళ్లి చేసుకున్నాడని సమాచారం.
పై వార్త చదివేసి నమ్మస్తే మీరు మోసపోయినట్టే. అసలు సంగతి అది కాదు. ఆది నటిస్తోన్న ఓ సినిమా షూటింగ్లో పెళ్లి సీన్లో భాగంగా ఈ సీన్ చిత్రీకరించారట. అయితే ఈ ఫొటోను పట్టుకుని కొందరు సోషల్ మీడియాలో ఆదికి దొంగ పెళ్లి అంటూ ప్రచారం చేస్తున్నారు. దీనిపై స్పందించిన ఆది ఇది సినిమా షూటింగ్లో జరిగిన పెళ్లి అని…తన పెళ్లిపై తాను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పాడు.