డైరెక్టర్ గా స్టార్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్.. రెబల్ స్టార్ వరం ఇచ్చేశాడుగా..!

పాన్ ఇండియ‌న్ రెబల్ స్టార్‌గా.. సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్న ప్రభాస్.. డేట్స్ ద‌క్కించుకోవడం అంటే అది చాలా కష్టతరం. ఈ క్రమంలోనే.. ఇప్పటికే ఎంతోమంది టాప్ డైరెక్టర్లు, నిర్మాతలు సైతం ఆయన డేట్స్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇలాంటి క్రమంలో.. ప్రభాస్ కొత్త దర్శకుడికి డేట్స్ ఇచ్చాడంటూ టాక్ వైరల్ గా మారుతుంది. ఇంతకీ.. అతను మరెవరు కాదు.. కొరియోగ్రాఫర్ ప్రేమ్‌ రక్షిత్. యమదొంగ, కంత్రి ,ఆర్య 2 లాంటి ఎన్నో సినిమాలు కురియోగ్రాఫర్ గా వ్యవహరించిన ప్రేమ రక్షిత్‌.. ఆర్‌ఆర్ఆర్ సినిమాలో ఆస్కార్ విన్నింగ్ సాంగ్ నాటు నాటుకు డాన్స్ కంపోజ్ చేశాడు.

ఇక మారుతి డైరెక్షన్‌లో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ది రాజాసాబ్ సినిమాకు ఆయన కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే.. మూవీ షూట్ టైంలో ప్రేమ్ రక్షిత్‌.. ప్రభాస్‌కు ఓ కథ వినిపించాడట. ప్రభాస్‌కు కూడా స్టోరీ బాగా నచ్చేసిందని.. దీంతో ప్రేమ్ రక్షిత్ కు దర్శకుడుగా సినిమా తీసేందుకు ఛాన్స్ ఇచ్చేసాడు అంటూ టాక్‌ నడుస్తుంది. అయితే.. ఇప్పటివరకు ప్రేమ రక్షిత్‌కు సినిమా తీసిన అనుభవం లేదు. అయినా సరే.. ప్రభాస్ కాన్సెప్ట్ న‌చ్చేయడంతో ప్రేమ్ రక్షిత్‌కు వరమిచ్చేసాడట‌.

RRR wins Oscars: Meet Choreographer Prem Rakshith who gave viral Naatu  Naatu steps

ఈ క్రమంలోనే వీళ్ళిద్దరి కాంబోలో పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ తెర‌కెక్క‌నున్నట్లు సోషల్ మీడియాలో టాక్ వైరల్ గా మారుతుంది. ప్రభాస్ తన కెరీర్ లో ఇప్పటివరకు కేవలం ఇద్దరు కొత్త దర్శకులకు మాత్రమే అవకాశాలు ఇచ్చాడు. వాళ్లలో ఒకరు వంశీ పైడిపల్లి, మరొకరు కొరటాల శివ. మున్న సినిమాతో వంశీ కి సక్సెస్ ఇస్తే.. కొర‌ట్టాల శివ డైరెక్షన్లో వచ్చిన మిర్చి సైతం మంచి రిజల్ట్ అందుకుంది. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలు చేసిన అనుభవం ఉన్న దర్శకులకు సైతం ప్రభాస్ అవకాశాలు ఇచ్చాడు. ఇక ప్రస్తుతం.. ప్రభాస్ డేట్స్ కోసం సందీప్ రెడ్డివంగా, నాగ అశ్విన్‌, ప్రశాంత్ నీల్‌ ఎదురుచూస్తున్న పరిస్థితి. అయితే.. ప్రభాస్ మాత్రం ఈ సీక్వెల్స్ విషయంలో ఇంకా క్లారిటీ రాకుండానే.. కొత్త దర్శకులకు అవకాశాలు ఇస్తుండడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే.. ప్రభాస్ ప్రేమ్‌ రక్షిత్‌కు నిజంగా అవకాశం ఇచ్చాడా.. లేదా మరి కొంతకాలం వేచి చూడాల్సిందే.