అఖండ 2.. రిలీజ్ డేట్ విషయంలో ఆ బిగ్ మిస్టేక్..!

టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాలకృష్ణ, బోయపాటి కాంబోలో తెరకెక్కిన అఖండ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అఖండ విజయం అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 5 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా బాలయ్య ఫ్యాన్స్‌కే కాదు.. మాస్ మూవీ లవర్స్‌ను సైతం విపరీతంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే.. తాజాగా ఈ సూపర్ హిట్ సినిమా సీక్వెల్ గా అఖండ 2 రూపొందించనున్నారు. ఈ సినిమాపై ఆడియన్స్‌లో భారీ హైప్‌ మొదలైంది. ఇలాంటి క్రమంలో.. తాజాగా సినిమా రిలీజ్ డేట్‌కు సంబంధించిన న్యూస్ ఫ్యాన్స్‌కు కూడా డిసప్పాయింట్మెంట్ మిగుల్చింది. మొదట దసరా సెలబ్రేషన్స్ లో భాగంగా సెప్టెంబర్ 28న అఖండ 2ను గ్రాండ్గా రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ ఎనౌన్స్ చేసినా.. త‌ర్వాత సినిమాను వాయిదా వేశారు మేకర్స్‌.

Akhanda 2: Thandavam teaser out: Nandamuri Balakrishna film to hit cinemas  around Dussehra - CNBC TV18

ఈ క్రమంలోనే.. తాజాగా డిసెంబర్ 5న సినిమాను రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్గా పోస్టర్ ద్వారా ప్రకటించారు. ఈ క్రమంలోనే.. లేటెస్ట్‌ రిలీజ్ డేట్ పై సోషల్ మీడియాలో పలు రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బంగారం లాంటి దసరా పండగ సీజన్ ను వదిలేసి.. ఎప్పుడో డిసెంబర్ 5. ఎటూ కానీ రోజుల్లో రిలీజ్‌కు ఫిక్స్ చేయడం అస్సలు సరైన నిర్ణయం కాదంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. దసరా సెలబ్రేషన్స్‌లో సినిమా రిలీజై ఉంటే.. బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని సంపాదించుకోవడమే కాదు.. కలెక్షన్ల పరంగా రికార్డులు క్రియేట్ చేసి ఉండేదని.. ఇక సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే.. బాక్సాఫీస్ బ్లాస్ట్ చూసేవాళ్ళమంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

NBK Akhanda 2 Special Look: Striking Nataraj Pose | NBK Akhanda 2 Special  Look: Striking Nataraj Pose

సెలబ్రేషన్ డేస్ లో ఆడియన్స్ థియేటర్లకు రావడానికి భారీ స్కోప్ ఉంటుంది. అలాంటి.. కీలకమైన సెలబ్రేషన్ హాలిడేస్ ను వదులుకొని.. డిసెంబర్‌లో అది కూడా ఎలాంటి హాలిడేస్ లేని రోజుల్లో రిలీజ్ చేయడం చాలా తప్పంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సినిమా రిలీజ్ డేట్ విషయంలో మాత్రం మేకర్స్‌ ఇలాంటి బిగ్ మిస్టేక్ చేయకుండా ఉండవలసిందంటూ నెగిటివ్ కామెంట్ చేస్తూ మేకర్స్ ను తిట్టిపోస్తున్నారు. ఫస్ట్ పార్ట్‌ అఖండ సృష్టించిన ప్రభంజనం హైప్‌ అయితే.. కచ్చితంగా అఖండ 2 పై ఉంటుంది. కానీ.. పండగ సీజన్ లో అయితే దీని హైప్‌ మరింత డబల్ అయ్యేది. బాక్సాఫీస్ రికార్డుల మొత్తం మోగిపోయేదని.. అనవసరంగా రిలీజ్ డేట్ ను మార్చారని డిసప్పాయింట్మెంట్ మాత్రం ఫ్యాన్స్‌లో మిగిలిపోయింది. అదే సినిమా.. వాయిదాకు గల కారణాలు మాత్రమే ఇప్పటికీ వెల్లడించలేదు.