OG యూనివర్స్ లో నటించడంపై పవర్ స్టార్ క్లారిటీ..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ. సెప్టెంబర్ 25న గ్రాండ్గా రిలీజై ఆడియన్స్‌ను కట్టుకున్న సంగతి తెలిసిందే. గ్యాంగ్ స్ట‌ర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా.. కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈ క్రమంలోనే.. సినిమా రిలీజ్ అయిన వారం రోజుల్లో రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టి రికార్డ్‌ క్రియేట్ చేసింది. ఇక ఈ సక్సెస్‌ని సెలబ్రేట్ చేసుకుంటూ.. అక్టోబర్ 1 బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో గ్రాండ్ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేశారు టీం.

ఈ ఈవెంట్‌లో డైరెక్టర్ సుజిత్, మ్యూజిక్ డైరెక్టర్ థ‌మన్, ప్రొడ్యూసర్ దానయ్య, దిల్ రాజులతో పాటు.. పవన్ కళ్యాణ్ సైతం హాజరై సందడి చేశాడు. ఇందులో భాగంగానే పవన్ మాట్లాడుతూ టీం పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ క్రమంలోనే ఫాన్స్ తో సైతం గుడ్ న్యూస్‌ను షేర్ చేసుకున్నాడు. ఓజి ప్రేక్వెల్, సీక్వెల్ లోను కచ్చితంగా తాను నటిస్తానంటూ వివరించాడు. సుజిత్ టేకింగ్ తనకు చాలా నచ్చేసిందని.. అతని కోసమే ఓజీ యూనివర్సిటీలో కచ్చితంగా భాగం అవుతా అంటూ వివరించాడు.

అయితే.. తన పొలిటికల్ లైఫ్ కారణంగా రాబోయే సినిమాల విషయంలో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అవుతాయంటూ.. డైరెక్టర్ సుజిత్ తో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం పవన్ చేసిన ఈ కామెంట్స్ నెటింట‌ వైరల్ గా మారడంతో.. పవన్ ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు.. ఓజీ యూనివర్స్ ఉంటుందంటూ డైరెక్టర్ చెప్పినా.. పవన సినిమాల్లో నటిస్తాడో.. లేదో అనే సందేహాలు అందరిలోనూ మొదలయ్యాయి. ఇక.. తాజాగా సక్సెస్ మీట్ లో పవన్ చేసిన ఈ కామెంట్స్‌తో అందరికీ క్లారిటీ వచ్చేసింది.