పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబోలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ.. పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాలు నడుమ రిలీజై.. మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది. ఈ క్రమంలోనే భారీ కలెక్షన్‌లతో బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. అంతేకాదు.. నిన్నటితో ఓజీ.. సంక్రాంతి వస్తున్నాం సినిమా కలెక్షన్స్ ని సైతం క్రాస్ చేసి.. ఈ ఏడాది హైయెస్ట్ వసూళ్లను కొల్లగొట్టిన నెంబర్ 1 సినిమాగా రికార్డ్ ను సృష్టించింది. ఇక రేపు నేషనల్ హాలిడే కావడంతో.. నేడు సాయంత్రం నుంచే ప్రతి సెంటర్లో సినిమాకు మరిన్ని బుకింగ్స్ జరగడం ఖాయమని.. కలెక్షన్స్ ఇంకాస్త పుంజుకుంటాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక ఇప్పటికే వరల్డ్ వైడ్ గా సినిమా.. 90% కు పైగా రికవరీ చేసుకుంది. మిగిలిన 10% ఈ రెండు రోజుల్లో బ్రేక్ ఈవెన్ అవడం ఖాయం అంటూ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. అంతేకాదు.. ఇక శని, ఆదివారాల నుంచి వచ్చే వసూలు మొత్తం సినిమాకు వచ్చే లాభాలని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ క్రమంగానే.. ఆరవ రోజు ఓజీ.. ప్రాంతాలవారీగా ఏ రేంజ్ లో కలెక్షన్లు కొల్లగొడుతుందో ఒకసారి చూద్దాం. నైజంలో రిటర్న్ జీఎస్టీతో కలిపి కోటి రూపాయల షేర్ వసుళ్లను కొల్లగొట్టిన ఈ సినిమా.. కృష్ణలో రూ.30 లక్షలు, తూర్పుగోదావరి జిల్లాలో రూ.31 లక్షలు, గుంటూరు జిల్లాలో 31, పశ్చిమగోదావరి జిల్లాలో 29, నెల్లూరు జిల్లాలో 20, సీడెడ్‌లో 55, ఉత్తరాంధ్రలో 51 లక్షల షేర్ వసూళ్లను కొల్లగొట్టింది. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలిపి 6 రోజులకు.. రూ.3 కోట్ల 47 లక్షల షేర్ సొంతం చేసుకోవడం విశేషం.
ఇక ఇటీవల కాలంలో ఈ రేంజ్ స్టడీ వసూళ్లు ఏ సినిమాకు చూడలేదని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. కేవలం తెలుగు రాష్ట్రాలనే కాదు.. ఓవర్సీస్ లోను సినిమా సత్తా చాటుకుంటుంది. ఆరు రోజుల రూ.70 లక్షలకు పైగా గ్రాస్ కొల్లగొట్టిన ఈ సినిమా 5వ రోజు కంటే రెండింతలు ఎక్కువగా కలెక్షన్లు సొంతం చేసుకోవడం విశేషం. మొత్తంగా 6వ రోజున రూ.11 కోట్ల గ్రాస్, రూ.6 కోట్ల షేర్ వసూళ్లు ఓజీకి దక్కాయి. అంటే.. ఈ ఆరు రోజులకు వరల్డ్ వైడ్గా రూ.153 కోట్ల గ్రాస్.. రూ.250 కోట్ల షేర్ వసూళ్లు ఓజీ దక్కించుకుంది. ఓవర్సీస్ లో రూ.70 కోట్ల వరకు కలెక్షన్లు కొల్లగొట్టిన ఈ సినిమా.. నైజాంలో ఈ వీకెండ్‌తో రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌ను టచ్ చేస్తుందని అంటున్నారు. కాగా.. ఉత్తరాంధ్ర, సీడెడ్, నెల్లూరు ప్రాంతాల్లో మాత్రం ఊహించిన రేంజ్ లో రెస్పాన్స్ రాలేదని.. స్వల్ప నష్టాలను ఎదుర్కొక తప్పదు అంటూ టాక్ నడుస్తుంది. ఒకవేళ మూడవ వారంలో కూడా సినిమా రన్ వస్తే మాత్రం బ్రేక్ ఇవ్వన్ అవకాశం ఉందట.