‘ OG ‘ లో చరణ్ ను ఎవరైనా గమనించారా.. పార్ట్ 2 ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబోలో తెర‌కెక్కిన లేటెస్ట్ మూవీ ఓజీ. నిన్న‌ గ్రాండ్ లెవెల్‌లో రిలీజై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ప్రీమియర్ షోస్ నుంచి వచ్చిన రెస్పాన్స్ తో మొదటి రోజు థియేటర్ లన్ని కిక్కిరిసిపోయాయి. ఈ క్రమంలోనే సినిమా చూసిన అడియ‌న్స్ అంతా.. సినిమాలో మరోసారి వింటేజ్ పవన్‌ను చూస్తున్నామని.. ఈ సినిమాతో పవన్ స్ట్రాంగ్ కం బ్యాక్ కాయమంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే.. సినిమాలో చాలా మంది గమనించని ఓ ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. అది ఎంతో కాన్సన్ట్రేషన్‌తో చూస్తే గాని అర్థం కాదు. ఈ సినిమా రిలీజ్‌కి ముందే.. మూవీలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ క్యారెక్టర్ ఉంటుందని ఒక లీక్ మేకర్స్ ఇచ్చారు.

ఇలాంటి గ్యాంగ్ స్ట‌ర్ మూవీలో.. సుభాష్ చంద్రబోస్ ఉండడం ఏంటి.. అసలు సుజిత్ ఏం ప్లాన్ చేశాడనే సందేహాలు అభిమానుల్లో తెగ వినిపించాయి. కానీ.. నేతాజీకి సంబంధించిన సీన్స్ ఏవి సినిమాలో లేకపోవడంతో.. సోషల్ మీడియాలో ప్రచారం కేవలం రూమర్ అని అంత భావించారు. కానీ.. తాజా సమాచారం ప్రకారం.. సినిమాలో నిజంగానే నేతాజీ బ్యాక్ డ్రాప్ సీన్స్ ఉంటాయట. అవి సీక్వెల్‌లో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ.. క్యారెక్టర్‌లో నటించేది మరెవరో కాదు.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అట. ఓ సీన్ కోసం రామ్ చరణ్ సుభాష్ చంద్రబోస్ గెటప్ లో కనిపించనున్నాడని తెలుస్తుంది. దానికి తగ్గట్టుగానే.. సినిమాలోని ఆ పాత్రలో చరణ్ ఉన్న ఓ చిన్న ఫోటో మూవీలో తళుక్కున మెరిసింది. దీన్ని గమనించిన కొంతమంది పవర్ స్టార్ అభిమానులు.. స్క్రీన్ షాట్ తీసి మరి సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.

అంతేకాదు.. ఫోటో నుంచి సుజిత్ ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందంటూ ర‌క‌ర‌కాల క‌థ‌లు అల్లేస్తున్నారు. ఇక ఇందులో వాస్తవం ఎంతో తెలియదు గాని.. సినిమా బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో నిన్న ప్రెస్ మీట్ లో సందడి చేశారు టీం. ఇందులో సుజిత్ ఓజీకి సీక్వెల్ ఉంటుందా అనే ప్రశ్నకు.. ఇప్పటికే ప్రకటించేసాము. కానీ.. నా దగ్గర ప్రస్తుతానికి దానికి కావాల్సిన స్క్రిప్ట్ సిద్ధంగా లేదంటూ వివరించాడు. అంటే.. చరణ్ ఫోటోని పార్టీ ఊహించుకొని సినిమా ఏమి తీయలేదు. ఫ్యాన్ మూమెంట్ కోసం మాత్రమే ఆ ఫోటోలు పెట్టినట్లు చెప్పకనే చెప్పేసాడు. కానీ.. అభిమానులు మాత్రం సుజిత్ ఆల్రెడీ ప్లాన్ చేసేసాడు.. కావాలనే ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇవ్వడానికి ఆ విషయాన్ని దాచుతున్నారని చర్చించుకుంటున్నారు. ఈ రెండిట్లో ఏది వాస్తవమో ముందుముందు తెలియనుంది.