టాలీవుడ్ క్రేజీ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ కిష్కింధపురి. కౌశిక్ పెగళ్లపాటి డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా నిన్న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. మిరాయ్ లాంటి పాన్ ఇండియన్ సినిమాకు పోటీగా ఆడియన్స్‌ను పలకరించిన ఈ సినిమా.. ప్రస్తుతం పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది. హారర్ జానర్‌లో రూపొందిన ఈ సినిమాని చూసిన ఆడియన్స్ అంతా ప్రస్తుతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
అయితే.. సినిమా రిలీజ్ కి ముందు పెద్దగా అంచనాలు లేకపోవడంతో.. ఓపెనింగ్ వసూళ్లు పెద్దగా లేకున్నా.. తర్వాత సినిమా నుంచి వచ్చిన పాజిటివ్ మౌత్ టాక్‌తో జనాల్లో సినిమాపై క్రేజ్ పెరిగింది. మాట్నీ షో నుంచి టికెట్ల సేల్స్ బాగా పుంజుకున్నాయి. దీంతో.. ఈ సినిమా డీసెంట్గా ఓపెనింగ్స్ ను దక్కించుకొని అందరికీ సర్ప్రైజ్ ఇచ్చింది. ప్రస్తుతం బుక్ మై షో లో ఈ సినిమాకు.. గంటకు మూడు వేలకు పైగా టికెట్లు అమ్ముడు పోవడం విశేషం.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం మొదటి రోజు సినిమా.. వకల్డ్ వైడ్‌గా దాదాపు రూ.2కోట్ల 50 లక్షలకు పైగా గ్రాస్ కొల్లగొట్టిందట. ఈ సినిమాకు పబ్లిక్ లో మంచి టాక్ ఉంది కనుక.. ఈరోజు, రేపు వీకెండ్స్ కూడా కావడంతో మరింత ఎక్కువ వసూళ్లు నమోదయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద బెల్లంకొండ శ్రీనివాస్ ఈ హారర్ థ్రిల్లర్‌తో మంచి కమర్షియల్ హిట్ ఖాతాలో వేసుకున్నట్టే.