నేడు టాలీవుడ్ బాక్సాఫీస్ బరిలో మీరాయ్, కిష్కింధపురి రెండు సినిమాలు స్ట్రాంగ్ పోటీతో నిలిచాయి. కాగా.. మీరాయ్ సినిమాలో తేజ సజ్జ హీరోగా నటించగా.. కిష్కింధపురి సినిమాకు హీరోగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చేశారు. ఈ రెండు సినిమాల్లో మీరాయ్ సినిమాకే పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాకు సంబంధించిన భారీ విజువల్స్, బడ్జెట్, అప్పటికే తేజ కు హనుమాన్ ద్వారా వచ్చిన పాపులారిటీ.. ఈ రేంజ్లో హైప్‌కు కారణం. ఇక సినిమాకు ప్రీవియస్ లేకపోవడంతో.. కిష్కింధపురి దానిని అవకాశంగా తీసుకుని ప్రీమియర్స్ తోనే చాలా వరకు రాబట్టాలని ప్లాన్ చేసుకుంది.
ఈ క్రమంలోనే నిన్న సాయంత్రం నుంచి హైదరాబాద్‌తో పాటు.. తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల ప్రీమియర్స్‌ను నిర్వహించారు టీం. సింగల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్ అని తేడా లేకుండా.. చాలా షోలను వేశారు. ఇక ఈ సినిమా రిలీజ్ కు ముందు ట్రైలర్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకున్నా.. రిజల్ట్ మాత్రం ఊహించినా రేంజ్ లో లేదట. హారర్ థ్రిలర్ సినిమా ఫస్ట్ హాఫ్ ఆడియన్స్‌లో క్యూరియాసిటీ పెంచేసినా.. సెకండ్ హాఫ్ ను మాత్రం వీక్‌గా డిజైన్ చేశాడని.. అస్సలు కాన్సన్ట్రేషన్ పెట్టలేదంటూ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇక ఇదే రోజున రిలీజ్ అయిన మీరాయ్ ఇప్పటికే పలు షోలను ముగించుకుంది. మీరాయ్ సినిమాకు సైతం మిక్స్డ్ టాక్ దక్కింది.
సినిమా విఎఫ్ఎక్స్ బాగుందని.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్.. అలాగే నటుల పర్ఫామెన్స్ మెప్పించిందని కథ విషయంలోనే సెకండ్ హాఫ్ లో డైరెక్టర్ కాస్త తడబడ్డాడు అంటూ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే సినిమాని మాత్రం ఖచ్చితంగా థియేటర్లలో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు అంటూ పలువురు ఆడియన్స్ తమ రివ్యూలను షేర్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే కిష్కింధపురికి వచ్చిన టాక్ మీరాయ్ సినిమాకు అడ్వాంటేజ్ గా మారుతుందని.. కచ్చితంగా మీరాయ్ ఈ పోటీలో విన్నర్‌గా నిలుస్తుందంటూ.. విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.