కూలీలో వన్ మ్యాన్ షో చేసిన దయాల్.. సౌబిన్ షాహిర్ బ్యాక్ గ్రౌండ్ ఇదే..!

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కూలీ. అగ‌స్ట్ 14న‌ గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. లోకేష్ కనకరాజ్‌ హీరోగా రూపొందిన ఈ సినిమాలో.. అక్కినేని నాగార్జున, సత్యరాజ్‌, ఉపేంద్ర, శృతిహాసన్, అమీర్ ఖాన్, సౌబిన్ షాహిర్ లాంటి స్టార్ కాస్టింగ్ మెరిసి ఆడియన్స్‌ను ఆకట్టుకున్నారు. అయితే.. ఈ సినిమా మొత్తంలో సౌబిన్ షాహిర్ పోషించిన దయాల్ రోల్ సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఈ క్రమంలోనే.. ఇంతకీ సౌబిన్ షాహిర్ ఎవరు.. అతని బ్యాగ్రౌండ్ ఏంటని సెర్చింగ్‌లు సోషల్ మీడియాలో మొదలైపోయాయి. కేవలం ఐదున్న‌ర‌ అడుగుల ఎత్తు, బట్టతల ఉన్న వ్యక్తి అందగాడంటే అవ‌కాశాలు వస్తాయా.. కనీసం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా పనికిరాడు అని అభిప్రాయాలు వ్యక్తం అవుతాయి.

Malayalam Actor Soubin Shahir Makes Tamil Debut With Rajinikanth's  Vettaiyan; Character Poster Released

కానీ.. వాటన్నింటిని తిప్పి కొట్టి.. టాలెంట్ ఉంటే ఎలాంటి పాత్రతో అయినా సత్తా చాటుకోవచ్చు అని రుజువు చేసుకున్నాడు సౌబిన్ షాహిర్. సినిమా పెద్దదా, చిన్నదా.. క్యారెక్టర్ చిన్నదా, పెద్దదా కాదు.. తనకిచ్చిన పాత్రతో తనని తాను ఎలా స్పెషల్గా ఎలివేట్ చేసుకోవాలని దానిపై కాన్సన్ట్రేషన్ పెడతాడు సౌబిన్. ఇంతకీ అసలు ఈ సౌబిన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి.. ఇండస్ట్రీ లోకి ఎలా ఎంట్రీ ఇచ్చాడు.. ఇప్పుడు తెలుసుకుందాం. మలయాళం మూవీ మంజుమ‌ల్‌ బాయ్స్ సినిమా అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. కేవలం రూ.7 కోట్ల బడ్జెట్ సినిమా ఏ రేంజ్‌లో బ్లాక్ బ‌స్టర్‌గా నిలిచిందో తెలిసిందే. ఇక ఈ సినిమాల్లో సౌబిన్ నటించడమే కాదు.. నిర్మాతగాను వ్యవహరించాడు. ఈ సినిమాతో ఒక్కసారిగా రూ.240 కోట్ల గ్రాస్ కలెక్షన్లను అందుకున్నాడు.

Actor Soubin Shahir joins Rajinikanth's 'Coolie', Lokesh Kanagaraj shares  new poster

ఇక సౌబిన్ తండ్రి మలయాళంలో పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వ్యవహరించాడు. కాగా సౌబిన్ అసిస్టెంట్ డైరెక్టర్ గానే ప్రయత్నిస్తూ.. ఈలోగా దొరికిన చిన్న చిన్న క్యారెక్టర్ చేసుకుంటున్న‌ క్రమంలోనే ప్రేమమ్‌ సినిమాలో ఛాన్స్ కొట్టేసాడు. ఈ సినిమా బ్లాక్ బ‌స్టర్‌గా నిలిచింది. ఇక సినిమాలో సౌబిన్.. టీచర్ సాయిపల్లవికి లైన్ వేసే పీటీ మాస్టర్ గా మెరిసాడు. ఆ తర్వాత ‘కుంబలంగి నైట్’ మూవీతో మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. దీంతో ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన క్యారెక్టర్స్ లో నటిస్తూనే.. మరోపక్క దర్శకుడిగాను మారాడు. సౌబిన్ డైరెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ ‘పరవ’. క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో ఇద్దరి ఫ్రెండ్స్ మధ్య సాగే కథ ఇది. కాగా ఈ మూవీ కొన్ని థియేటర్స్ లో 100 రోజులు ఆడింది. ఇక నిర్మాతగానూ తొలి అడుగులోనే హిట్ కొట్టిన తను స్వీయ నిర్మాణంలో మంజుమల్ బాయ్స్ లో నటించి మలయాళ ఇండస్ట్రీలోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన రెండో సినిమాగా రికార్డు క్రియేట్ చేశాడు. ‘వాలెట్టి’ మూవీలో కుక్కకి వాయిస్ అందించాడు..ఇంకా మమ్ముట్టి, మోహన్ లాల్, ఫహద్ ఫాజిల్, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్ హీరోల మూవీస్ లో కీలక పాత్రల్లో మెరిశాడు. ‘అంబలి’ సినిమాలో హీరోగా చేశాడు. ఓటీటీ ద్వారా ఇతర భాషల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న సౌబిన్.. రజనీకాంత్-లోకేష్ కనకరాజ్ కూలీలో ఛాన్స్ కొట్టేయడమే కాదు..సినిమా విజయంలో తాను ఒక స్పెషల్ పాత్ పోషించాడు.