కూలీతో లోకేష్ సక్సెస్ ట్రాక్ కు బ్రేక్ పడినట్టేనా..?

సినీ ఇండస్ట్రీలో ఏ రంగంలోనైనా సక్సెస్ తప్ప.. ఫెయిల్యూర్ లేకుండా కొనసాగడం అంటే సాధ్యం కాని పని. పెద్ద సవాళ్లతో కూడుకున్న విషయం. అలాంటిది.. కోలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్ కేవలం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాలుగేళ్లలోనే వరుసగా ఏడు సినిమాలు చేసి ఏడు సినిమాలతో ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా బ్లాక్ బస్టర్ దక్కించుకున్నాడు. సక్సెస్ తప్ప ఫెయిల్యూర్ గాని.. డైరెక్టర్‌గా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఇంతకీ.. అతను ఎవరో కాదు సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్.

మా నగరం తో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన లోకేష్.. తర్వాత ఖైదీ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి ట్రెండింగ్ గా మారాడు. ఒక్క రాత్రిలో జరిగే కథలో తెరకెక్కిన ఈ సినిమాతో లోకేష్ స్టార్ డైరెక్టర్‌గా మారిపోయాడు. ఇక.. ఈ సినిమా తర్వాత విజయ్‌తో మాస్టర్ సినిమాలను తెరకెక్కించి స్టార్ దర్శకుల లిస్టులో మొదటి వరుసలో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ కూలి సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. భారీ కాస్టింగ్ తరుపున ఈ సినిమాకు దాదాపు రూ.350 కోట్ల వరకు బడ్జెట్ అయిందట. ఇక సినిమా రిలీజ్ కి ముందే ఆడియన్స్‌లో భారీ హైఫ్‌ను క్రియేట్ చేసినా మూవీ కూలి.

తాజాగా.. గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ అయింది. ఇక సక్సెస్ ట్రక్‌తో దూసుకుపోతున్న లోకేష్.. కెరీర్ మోస్ట్ ప్రాజెక్ట్‌గా ఈ సినిమా వచ్చింది. అయితే.. సినిమా ఓపెనింగ్ బుకింగ్స్‌లోను రికార్డులు క్రియేట్ చేసింది. ఇలాంటి క్రమంలో పాజిటివ్ టాక్ వస్తే ఖచ్చితంగా విజయ్ సక్సెస్ ట్రక్ మళ్ళీ రిపీట్ అవుతుందని అంతా భావించారు. కానీ.. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఓవర్సీస్ ప్రీమియర్స్‌తో పాటు.. తమిళనాడు ఫస్ట్ షో నుంచి మిక్స్డ్‌ టాక్ వచ్చింది. కాగా.. క‌థ‌, కంటెంట్‌ వీక్‌గా ఉన్నాయ‌ని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే ఇప్పటివరకు కెరీర్‌లో ఒక్క ఫ్లాప్ కూడా లేని లోకేష్ సక్సెస్ ట్రక్‌కు బ్రేక్ పడ‌నుందంటూ టాక్ వైరల్ గా మారుతుంది. మరోవైపు ఫ్రీ ఓపినింగ్స్‌ కారణంగా బుకింగ్ లో మాత్రం ఇంకా సత్తా చాటుతూనే ఉంది. వచ్చే సోమవారం వర్కింగ్ డే ప్రారంభమైతే కానీ కూలి రిజల్ట్ పై క్లారిటీ ఉండదు.