కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్,సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబోలో తెరకెక్కిన కూలి ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ సాహిర్, శృతిహాసన్, సత్యరాజ్, పూజా హెగ్డే లాంటి.. సార్ సెలబ్రెటీస్ అంతా మెరిసిన ఈ సినిమా మొదటిరోజు ఫస్ట్ షో నుంచే మిక్స్డ్ టాక్‌ను తెచ్చుకుంది ఫస్ట్ హఫ్ అందరినీ ఆకట్టుకున్నా.. సెకండ్ హాఫ్ బోర్ ఫీల్ కలిగించిందని నీరసం తెప్పిస్తుందంటూ అభిమానుల సైతం నిరాశ వ్యక్తం చేశారు. అయితే.. అడ్వాన్స్ బుకింగ్స్ కారణంగా కూలీ ఫస్ట్‌డే భారీ వసుళ్లును కొల్లగొట్టింది. కాగా.. 2025 ఏడాదిలో హైయెస్ట్ ఓపెనింగ్ దక్కించుకున్న సినిమాగా కూలీ టాప్‌లో నిలిచి రికార్డ్ సృష్టించింది.
ఈ క్రమంలో అన్ని మార్నింగ్ షోకు 82% , మధ్యాహ్నం 85%, సాయంత్రం 87% ఆక్యుపెన్సీని దక్కించుకుంటూ కూలి దూసుకుపోయింది. అయితే రాత్రికి నెగటివ్ టాక్ బాగా స్ప్రెడ్ అయినా.. వీకెండ్ డేస్ కావడంతో అప్పుడు కూడా 80% ఆక్యుపెన్సితో కొనసాగింది. అలా.. ఫస్ట్ డే కూలి రూ.100 కోట్ల పైగా అడ్వాన్స్ బుకింగ్‌ను దక్కించుకుంది. ఓపెన్ బుకింగ్స్‌తో కలిపి మొదటి రోజు కూలి మూవీకి ఇండియాలో రూ.65 కోట్ల నెట్ వసూళ్లు దక్కయ్యని సాక్‌నిల్క్ నివేదిక వెల్లడించింది. కూలి మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.650 కోట్ల గ్రాస్ వసూళ్లు కొలగొట్టాల్సి ఉంది. కాగా.. మొదటి రోజులోనే దాదాపు 20 శాతం వరకు రికవరీ అయిపోయినట్లు టాక్ నడుస్తుంది. అలాగే.. ఆగస్టు 14న భారీ అంచనాలతో రిలీజ్ అయిన వార్ 2 సినిమా సైతం ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది.
కూలీలతో పోలిస్తే వార్ 2 మూవీపై పెద్దగా అంచనాలు లేకుండా సినిమాకు మాత్రం టాక్ బాగుండడం ఇండిపెండెన్స్ డే లాంగ్ వీకెండ్ కావడంతో పాటు.. అసలు నెమ్మదిగా పెరగనున్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి తెలుగు రాష్ట్రాల్లో తారక్ కారణంగా మంచి బుకింగ్సే దక్కాయి. మార్నింగ్ షోకి 75%, మధ్యాహ్నం 68%, సాయంత్రం 73% ఆక్యుపెన్సి దక్కింది. నైట్ షో టైం కి కూలి మూవీతో పోలిస్తే వార్ 2కి బుకింగ్స్ భారీగానే జరిగాయి. ఓవరాల్‌గా వార్ 2 ఇండియన్ మార్కెట్లో రూ.55 కోట్ల వసూళ్లను దక్కించుకున్నట్లు వెల్లడించింది. కూలీ కంటే వార్ 2 దాదాపు రూ.10 కోట్లకు పైగానే తక్కువ కలెక్షన్లను కొల్లగొట్టింది. కూలి మూవీకి తమిళనాడు, కేరళ, కర్ణాటక అలాగే తెలుగు రాష్ట్రాలలోను భారీ ఓపెనింగ్స్ దక్కాయి. వార్ 2 మూవీ క్రేజ్ కేవలం రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితం కావడంతో వసూళ్లలో తేడా క్లియర్‌గా కనిపించింది. వీకెండ్ తర్వాత ఏ మూవీ బాక్సాఫీస్ దగ్గర స్టడీ కలెక్షన్లను కొల్లగొడుతుంది.. ఏ మూవీ హిట్ స్టేటస్‌ను అందుకుంటుందో చూడాలి.