కూలీ, వార్ 2 సినిమాల అడ్వాన్స్ సేల్స్.. వార్ 2 మరీ ఇంత వీకైపోయిందే..?

రేపు.. (ఆగస్ట్‌ 14) కూలీ, వార్ 2 రెండు సినిమాలు మధ్యన టఫ్ కాంపిటీషన్ మొదలుకానుంది. రెండు సినిమాలపై ఆడియన్స్‌లో ఇప్పటికే మంచి హైప్ నెలకొంది. ఇక ఈ రెండు సినిమాలు ఒకటి బాలీవుడ్ మూవీ.. మరొకటి కోలీవుడ్ మూవీ అయినప్పటికీ.. టాలీవుడ్ ఆడియన్స్ లోను రెండు సినిమాలపై మంచి అంచనాల నెలకొన్నాయి. ఫ్యాన్స్ తో పాటు.. సినీ లవర్స్ సైత్ ఏ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎలాంటి క్రమంలో అన్ని చోట్ల టికెట్ బుకింగ్ ఓపెన్ అయ్యి జోరు చూపిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే సినిమా ఫ‌స్ట్ డే చూడడానికి టికెట్లు బుక్ చేసుకుంటూ.. అడ్వాన్స్ సేల్స్‌లో తమకు సినిమాపై ఉన్న క్రేజ్ ఏంటో చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే కూలీ సినిమా జోరుగా దూసుకుపోతోంది. సూపర్ స్టార్ రజినీకాంత్‌కి ఇండియాతో పాటు.. మలేషియా, జపాన్, సింగపూర్, అమెరికాలో కూడా భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.

దానికి తగ్గట్టుగా సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు సినిమాకు దర్శకుడు వ్యవహరిస్తున్నాడు. అంతేకాదు.. అక్కినేని నాగార్జున, బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్‌ కామియో అపీరియన్స్ తో మెరుస్తున్న నేపథ్యంలో ఈ సినిమాపై మరింత హైప్ నెలకొంది. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర తదితరులు ఈ సినిమాల్లో కీలకపాత్రలో మెరువనున్నారు. దీంతో.. ఈ సినిమా అడ్వాన్స్ సేల్స్ అదరగొడుతుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ.75 కోట్ల గ్రాస్ కలెక్షన్లు కల్లగొట్టిన ఈ సినిమా.. కేవలం అమెరికా నుంచి రూ.20 కోట్ల రేంజ్‌ అడ్వాన్స్‌లు దక్కించుకోవడం అంటే సాధారణ విషయం కాదు. ఇక.. సినిమాకు గడువు నేడు కూడా ఉంది. ఈ క్రమంలోని మొదటి రోజు కలెక్షన్ లో కూలి సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సులువుగా రూ.120 కోట్ల వరకు కలెక్షన్లు దక్కించుకోవచ్చని అంచనా. ఓ పక్క కూలి సినిమా ఈ రేంజ్ లో సత్తా చాటుతుంటే.. వార్ 2 మాత్రం చాలా అంటే చాలా వీక్ అయిపోయింది. కనీసం కూలి సినిమా దరిదాపుల్లో కూడా వార్ 2 సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ జ‌ర‌గ‌డం లేదు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా వార్ 2 సినిమాకు.. కేవలం రూ.20 కోట్ల అడ్వాన్స్ సేల్స్ మాత్రమే జ‌రిగింది. ఇక తాజాగా తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ ఓపెన్ చేశారు. కనుక.. ఈ సినిమాల కలెక్షన్స్ లెక్క నేడు మారే అవకాశం ఉంది. టాలీవుడ్ ఆడియన్స్ లో చాలామంది కేవలం ఎన్టీఆర్ కోసమే సినిమాకు వెళ్లడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక వైఆర్ఎఫ్ సినిమాకి యూనివర్స్ లో రూపొందుతున్న బాలీవుడ్ మూవీ కావడంతో.. అక్కడ సినిమా పై అంచనాలు బాగానే ఉన్నాయి. బుకింగ్స్ కూడా అదే రేంజ్ లో జరుగుతున్నాయి.