ఆ మేటర్ లో ఎన్టీఆర్‌, పవన్ కంటే చరణ్ చాలా బెట‌ర్‌.. ప్రూఫ్ ఇదే..!

ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఏ చిన్న విషయమైనా క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇక స్టార్ హీరోల అభిమానులు సైతం సోషల్ మీడియాను తమ హీరోలకు కలిసి వచ్చేలా వాడుకుంటూ.. ఎప్పటికప్పుడు రకకాల పోస్టులతో ట్రెండింగ్ చేస్తున్నారు. ఓ స్టార్ హీరో అభిమానులు.. ఇతర స్టార్ హీరోల సినిమాలను తమ హీరోల సినిమాలతో కంపేర్ చేస్తూ ఆ విషయంలో మీకంటే మా హీరోనే బెటర్ అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా.. తాజాగా పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్‌ల కంటే ఓ విషయంలో చరణ్ చాలా బెటర్ అంటూ.. ఇదే దానికి బిగ్గెస్ట్ ప్రూఫ్ అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే.. రామ్ చరణ్ చివరి మూవీ గేమ్ ఛేంజర్ ఎలాంటి డిజాస్టర్ టాక్‌ను తెచ్చుకుందో తెలిసిందే.

శంక‌ర్‌ డైరెక్షన్లో కీయార అద్వానీ హీరోయిన్గా, అంజలి మరో హీరోయిన్గా మెరిసిన ఈ సినిమా దారుణ దారుణమైన ట్రోల్స్ ను సైతం ఎదుర్కొంది. అయితే.. ఈ సినిమా అనౌన్స్ చేసిన దానికంటే ఆలస్యం అవుతూ లేటుగా రావడం కారణంగానే ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందలేదంటూ అప్పట్లో అభిమానులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే.. ఎప్పుడు సోషల్ మీడియాలో హరిహర వీరమల్లు, వార్ 2 సినిమాలను గేమ్ ఛేంజ‌ర్‌తో కంపేర్ చేస్తూ.. ఈ బ‌డా సినిమాల కంటే.. మా చరణ్ అన్న గేమ్ ఛేంజ‌ర్‌ చాలా బెటర్ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ సినిమాలు యూఎస్ మార్కెట్లో చాలా తక్కువ ప్రీమియర్స్ ను దక్కించుకుంటున్నాయి అంటూ అభిప్రాయాలను వ్యక్తం అవుతున్న క్ర‌మంలో.. యూఎస్ మార్కెట్లో టాలీవుడ్ సినిమాల హవా సైతం అంతకంతకు తగ్గిపోతుంది.

Hari Hara Veera Mallu Box Office Prediction Will Pawan Kalyan's Epic Beat  Ram Charan's Game Changer? | The Filmy Charcha

కాగా.. ఇప్పుడు గేమ్ ఛేంజ‌ర్‌ సినిమా ప్రీమియర్ కలెక్షన్స్‌ను గుర్తు చేసుకుంటూ.. వీర‌మల్లు, ప్ర‌జోంట్ రానున్న వార్ 2 సినిమా ప్రీమియర్స్.. వారం టైంలో కలెక్ట్ చేసిన లెక్కలను కంపేర్ చేస్తూ.. వీటి కంటే గేమ్ ఛేంజర్ కలెక్షన్స్ చాలా బెటర్ అని.. ఓపెన్ అయిన వారానికిరూ. 3 లక్షలకు పైగా గ్రాస్ కొల్లగొట్టిందంటూ.. ఇక వీరమల్లు, వార్ 2 లాంటి భారీ సినిమాలకు రెండు లక్షల మార్క్‌ కూడా దాటలేకపోయాయి అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఫ్లాప్ సినిమా అయినా మా చరణ్ అన్న గేమ్ ఛేంజ‌ర్‌ ఈ రెండు సినిమాల కంటే బెస్ట్ అంటూ మురిసిపోతున్నారు మెగా ఫ్యాన్స్. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో హైలెట్ చేస్తూ ఎన్టీఆర్, ప‌వ‌న్‌ లను ట్రోల్ చేస్తున్నారు.