కూలీ స్టార్ కాస్టింగ్.. రెమ్యునరేషన్ లెక్కలు ఇవే.. నాగార్జునకు బంపర్ ఆఫర్..!

కోలీవుడ్ త‌లైవర్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్‌ డైరెక్షన్‌లో రూపొందిన లేటెస్ట్ మూవీ కూలీ. ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసిన మేకర్స్.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఫుల్ బిజీబిజీగా గడిపేస్తున్నారు. సినిమా నుంచి పెద్దగా ప్రమోషనల్ కంటెంట్ ఏమీ బయటకు రాకపోయినా.. ఇప్పటికే సినిమాపై మాత్రం ఆడియన్స్‌లో మంచి హైప్‌ నెలకొంది. తాజాగా రిలీజ్ అయిన పూజ హెగ్డే మౌనిక సాంగ్‌ ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. ఇక ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ అప్పటి నుంచే సినిమాపై భారీ హైప్‌ నెలకొంది. ఈ క్రమంలోనే సినిమా నుంచి టీజర్, ట్రైలర్ ఏమీ రిలీజ్ కాకున్నా బిజినెస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో జరుగుతుంది. దానికి ప్రధాన కార‌ణం.. స్టార్ కాస్టింగ్ సెలక్షన్ అనడంలో సందేహం లేదు.

Aamir Khan rocks rugged avatar as Dahaa in Rajinikanth Coolie first look  out - India Today

లోకేష్ కనకరాజ్‌, రజనీకాంత్ కాంబో మూవీ అంటే ఆడియన్స్ ఏ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తారో అంతకుమించి కాస్టింగ్ తో లోకేష్ సినిమాపై హైప్‌ ను పెంచేశాడు. నాగార్జున విలన్ గా, ఉపేంద్ర, సౌబిన్‌ సాహిర్, అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు కీలకపాత్రలో నటిస్తుండడంతో సినిమాపై ఆడియన్స్ లో మంచి హైప్‌ నెలకొంది. మేకింగ్ కాస్ట్ పెద్దగా లేకుండా.. స్టార్ కాస్టింగ్ మాత్రం భారీగా ఉండడంతో సినిమాకు భారీగానే ఖర్చు అయింది. ఈ క్రమంలోనే సినిమా కాస్టింగ్ ఎవరెవరు.. ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో ఒకసారి చూద్దాం. సినిమా దర్శకుడు లోకేష్ కనకరాజ్‌ ఏకంగా రూ.50 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ని ఛార్జ్ చేశాడట. ఈ విషయాన్ని రీసెంట్గా ఇంటర్వ్యూలో తనే స్వయంగా వెల్లడించాడు.

Telugu Times | International Telugu News

ఇక మిగిలిన ఆర్టిస్టుల రెమ్యూనరేషన్ విషయానికొస్తే.. రజినీకాంత్ అక్షరాల రూ.150 కోట్లు ఛార్జ్ చేశాడట. అలాగే.. విలన్ గా నాగార్జున రూ.24 కోట్లు అందుకున్నట్లు సమాచారం. ఇక నాగ్ కెరీర్‌లోనే ఇది హైయెస్ట్ రెమ్యునరేషన్. ఇన్ని రోజులు హీరోగా చేసినా నాగ్‌ ఈ రేంజ్‌లో రెమ్యూనరేషన్ను పుచ్చుకోలేదు. అలాగే అమీర్ ఖాన్‌ సినిమాలో గెస్ట్ రోల్ కోసం రూ.25 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు టాక్. క్లైమాక్స్ లో వచ్చే పాత్ర అయినా సినిమాపై చాలా ప్రభావం ఉంటుందని స్వయంగా లోకేష్ కనకరాజ్‌ వివరించాడు. ఇక ఉపేంద్ర ఈ సినిమా కోసం రూ.10 కోట్లు, శృతిహాసన్ రూ.4 కోట్లు, పూజా హెగ్డే స్పెషల్ సాంగ్‌కు రూ.2 కోట్లు, సౌబిన్ సాహిర్ రూ.7కోట్ల రెమ్యునరేషన్ చార్జ్ చేశారట.