బాలయ్య – జక్కన్న కాంబోలో ఏకంగా మిస్సయిన బ్లాక్ బస్టర్ ల లిస్ట్ ఇదే..!

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం పాన్ ఇండియా ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోలను మించిపోయే ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న జక్కన్న.. సక్సెస్ తప్ప ఫెయిల్యూర్ ఎరుగని డైరెక్టర్గా తిరుగులేని క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ఆయన ఈ జనరేషన్ హీరోలైన ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్, రవితేజ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు తెర‌కెక్కించి సూపర్ డూపర్ హిట్లు ఇచ్చాడు. అంతే కాదు.. తారక్, చరణ్, ప్రభాస్ లను పాన్‌ ఇండియా స్టార్ హీరోలుగా మార్చిన ఘనత సైతం రాజమౌళికే దక్కుతుంది. అలాంటి రాజమౌళి తన సినీ కెరీర్‌లో ప్రజెంట్ ఉన్న సీనియర్ స్టార్ హీరోలు ఒక్కరితో కూడా ఒక్క సినిమా కూడా చేయకపోవడం గమనార్హం.

Simhadri

కాగా గ‌తంలో మాత్రం ఆయ‌న నందమూరి నట‌సింహం బాలయ్యతో ఏకంగా రెండు సార్లు సినిమా తీయాల‌ని ప్లాన్ చేసినా ఆ సినిమా సెట్స్‌ పైకి వెళ్లలేదంటూ న్యూస్ వైరల్ గా మారుతుంది. జక్కన్న.. గతంలో ఎన్టీఆర్ తో తెరకెక్కించిన సింహాద్రి సినిమాని మొదట బాలయ్యతో చేయాలని భావించారట. బాలయ్య కు స్టోరీని కూడా వినిపించినా.. అప్ప‌టికే పల్నాటి బ్రహ్మనాయుడు సినిమాతో బిజీగా ఉన్న బాలయ్య.. ఈ సినిమాను వదులుకున్నాడు. ఇక తర్వాత.. జక్కన్న ఈ సినిమాను తారక్ తో తెరకెక్కించి బ్లాక్ బస్టర్ కొట్టాడు.

Magadheera (2009) - IMDb

ఇక టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్‌ ప్రారంభంలో నటించి.. బ్లాక్ బస్టర్ అందుకున్న మగధీర సినిమాను సైతం మొదట రాజమౌళి.. బాలయ్యకు వినిపించాడట. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోలో వివరించాడు. తర్వాత.. ఏవో కారణాలతో ఈ సినిమాను రాంచరణ్ నటించగా.. ఈ మూవీ తెలుగులోనే రూ.50 కోట్ల క‌లోక్ష‌న్‌లు కొల్ల‌గొట్టిన మొద‌టి మూవీగా రికార్డు క్రియేట్ చేసింది. అలా.. గతంలో బాలయ్య, రాజమౌళి కాంబోలో రావలసిన రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు మిస్ అయ్యాయి. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళ కాంబోలో సినిమా వచ్చే అవకాశమే లేదు.