కనీసం వాట్సప్ కూడా వాడని టాలీవుడ్ ఏకైక డైరెక్టర్.. ఎవరంటే..?

సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్గా అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు.. తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకోవడం కోసం ఆరాటపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే.. కంటెంట్ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటూ సినిమాలను సెట్స్‌పైకి తీసుకువస్తారు. అలా.. ఎన్నో అద్భుతమైన సినిమాలను తెర‌కెక్కించి.. స్టార్ డైరెక్టర్‌గా సక్సెస్‌ఫుల్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న టాలీవుడ్ డైరెక్టర్‌ల‌లో దర్శకధీరుడు రాజమౌళి మొదటి వరుసలో ఉంటాడు. ఈయన ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ఇమేజ్‌తో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హాలీవుడ్ సెలబ్రిటీస్ సైతం ఆయన పై ప్రశంసలు కురిపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాంటి రాజమౌళి చేతనే ఓ టాలీవుడ్ డైరెక్టర్ ప్రశంసలు అందుకున్నాడు.

 

ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు.. అంతలా రాజమౌళి ప్రశంసలు కురిపించడానికి గల కారణం ఏంటో ఒకసారి చూద్దాం. అతను మరెవరో కాదు మ్యాజికల్ మూవీస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల. తాజాగా.. కుబేర సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా ఏర్పాటు చేశారు కుబేర టీం. ఇక కుబేర సినిమాల్లో ధనుష్, రష్మిక జంటగా నటిస్తుండగా.. నాగార్జున కీలకపాత్రలో మెరవనున్నారు. ఇక ఈ సినిమా జూన్ 20న గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి స్పెషల్ గెస్ట్ గా హాజరై సందడి చేశాడు. ఇందులో భాగంగా.. శేఖర్ కమ్ముల గురించి మాట్లాడుతూ ప్రశంసలు కురిపించాడు. నేను నమ్మే సిద్ధాంతాలకు తీసే సినిమాలుకు అసలు పొంతనే ఉండదు. కానీ.. శేఖర్ కమ్ముల అలా కాదు.. తను నమ్మిన సిద్ధాంతాల పైన సినిమాలు తీస్తాడు. ఇండస్ట్రీకి వచ్చి పాతికేళ్లైనా సరే ఎప్పుడు తన సిద్ధాంతాన్ని తప్పలేదు.

ఎన్ని అడ్డు వచ్చినా.. ఎక్కడ కాంప్రమైస్ కాకుండా తన సిద్ధాంతాలనే ఫాలో అవుతూ సినిమాలు చేసి సక్సెస్ అందుకుంటున్నాడు. అందుకే.. శేఖర్ కమ్ములా అంటే నాకు చాలా గౌరవం అంటూ ప్రశంసలు కురిపించాడు రాజమౌళి. ఇలాంటి సమయంలోనే మీరు వాట్సాప్ ఉపయోగిస్తారా అని శేఖర్ కమ్ములను రాజమౌళి ప్రశ్నించగా.. ఉపయోగించమని క్లారిటీ ఇచ్చాడు శేఖర్ కమ్ముల. దీంతో అంత షాక్ అయ్యారు. ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా యుగంలో ఎక్కువగా నడుస్తున్న యాప్ వాట్సప్. ప్రతి ఒక్క స్మార్ట్ మొబైల్ లోను కచ్చితంగా వాట్సాప్ ను ఉపయోగిస్తున్నారు. అలాంటిది.. శేఖర్ కమ్ముల లాంటి స్టార్ డైరెక్టర్ వాట్సాప్ ను ఉపయోగించకపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక హ్యాపీడేస్ సినిమాతో దర్శకుడుగా ఆడియన్స్ కు పరిచయమైన శేఖర్ కమ్ముల.. తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, లీడర్, లవ్ స్టోరీ లాంటి ఎన్నో సినిమాలను రూపొందించి సక్సెస్‌లు అందుకున్నాడు. ఇక ప్రస్తుతం శేఖర్ కమ్ముల నుంచి రానున్న కుబేర సినిమాపై కూడా ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్‌లో అంచనాలు నెల‌కొన్నాయి. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.