టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మల్లిడి వశిస్ట డైరెక్షన్లో విశ్వంభర సినిమాను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఇక ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ గా త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా మొదట సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ భావించినా.. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో.. చిరంజీవి మేకర్స్‌తో మాట్లాడి ఈ సినిమాను పోస్ట్ పోన్ చేశారు.
ఈ క్రమంలోనే సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న మెగాస్టార్ విశ్వంభర సినిమా వేసవి కానుకగా మే 9న రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారట. ఇకపోతే తాజాగా మాస్ మహారాజ్ రవితేజ నటించిన 75వ సినిమాకు.. మాస్ జాతర అనే టైటిల్ను ఫిక్స్ చేశారు మేకర్స్. అలాగే ఈ సినిమాను వచ్చే ఏడాది మే 9న రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేసారు.
ఈ క్రమంలో విశ్వంభర కూడా మే 9న రిలీజ్ అవుతుండడంతో.. చిరంజీవి, రవితేజ సినిమాలు ఒకేరోజు బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయితే గట్టి వార్ తప్పదు అంటూ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ సినిమా ఒకే రోజున రిలీజ్ చేస్తారా.. లేదా డేట్లు మారుతాయి తెలియాలంటే విశ్వంభర రిలీజ్ డేట్ అఫిషియల్‌గా ప్రకటించేవరకు వేచి చూడాల్సిందే. ఏది ఎమైన చిరుకు ఎదురెళ్ళటం అంటే రవితేజా పెద్ద రిస్క్ చేసినట్లే.