సినీ ఇండస్ట్రీలో సెలబ్రెటీల మధ్యన ప్రేమాయణం, బ్రేకప్స్, పెళ్లి తర్వాత విడాకులు ఇవన్నీ చాలా కామన్. ఇలాంటివి బాలీవుడ్ లో మరింత ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. అలా ఎంతో సుదీర్ఘకాలం రిలేషన్ తర్వాత డివోర్స్ తీసుకున్న సెలబ్రెటీస్ కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో తాజాగా బాలీవుడ్ నవాబ్.. సైఫ్ అలీ ఖాన్ చేరినట్లు సమాచారం. 2012లో బాలీవుడ్ టాప్ హీరోయిన్ కరీనాకపూర్, సైఫ్ అలీ ఖాన్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ జంటకు తైమూర్ , జహంగీర్ అలీ ఖాన్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే సైఫ్ ఇప్పుడు మూడో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. వీరిద్దరి మధ్యన సంబంధాలు సక్రమంగా లేవని.. కష్టకాలంలో రిలేషన్ నడుస్తుందని.. త్వరలోనే వీరు విడాకులు తీసుకోబోతున్నారని సైఫ్ అలీ ఖాన్ తన చేతిపై పచ్చబొట్టు వేయించుకున్న కరీనా పేరును తీసేసి దాని ప్లేస్ లో త్రిశూలం ఆకారంలో కొత్తగా మరో టాటూను వేయించుకున్నారని.. వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో వీరి రిలేషన్‌లో సమస్యలు ఉన్నాయని ఊహాగానాలు మరింత ఎక్కువయ్యాయి. అయితే ఇప్పటికే సైఫ్ అలీ ఖాన్‌కు 54 ఏళ్ళు అన్న సంగతి తెలిసిందే.
ఈ వయసులో సైఫ్‌కు మూడో పెళ్లి అవసరమా అంటూ.. పచ్చబొట్టు తీసేసి ఉద్దేశం ఉంటే అసలు ఎందుకు వేయించుకోవడం అంటూ.. కరినను వదిలి మూడో పెళ్లి చేసుకోబోతున్నావా సైఫ్ అంటూ.. నెగిటివ్గా కామెంట్స్ చేస్తూ ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. ఇక సైఫ్ అలీఖాన్‌కు కరీనాతో రెండో పెళ్లి అన్న సంగతి తెలిసిందే. మొదట సైఫ్‌కు 1991లో నటి అమృత సింగ్‌తో వివాహం జరిగింది. 13 సంవత్సరాల రిలేషన్ తర్వాత 2004లో వీరు విడాకులు తీసుకున్నారు. అప్పటికే వీరికి పిల్లలు కూడా ఉన్నారు. సైఫ్, అమృత విడిపోయినా.. పిల్లలకు మాత్రం కో పేరెంట్స్ గా ఇప్పటికి వారి బాగోగులు చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సైఫ్, కరీనాక కూడా విడాకులు ఇవ్వబోతున్నాడని.. మూడో వివాహం చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో నిజం ఎంతో తెలియాల్సి ఉంది.