పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయన గెలవాలి అని ఎంత బాగా కోరుకున్నారో.. ఆయన గెలవడానికి ఎంత కృషి చేశారో.. ఒక్కమాటలో చెప్పేదికాదు.. కొన్ని నెలలు ఆయన కోసం తీవ్రస్థాయిలో కష్టపడ్డారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ప్రమోట్ చేసే దగ్గర నుంచి ఆయనపై ట్రోలింగ్ చేసే వాళ్లకు ఘాటుగా ఇచ్చి పడేయడం వరకు ప్రతి విషయంలోనూ జనసైనికులు మెగా ఫ్యామిలీ .. మెగా ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బాగా సపోర్ట్ చేశారు. అందులో బండ్ల గణేష్ కూడా ఒకరు అని చెప్పాలి .
పవన్ కళ్యాణ్ అంటే బండ్ల గణేష్ కు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కచ్చితంగా రాజకీయాలలో సక్సెస్ అవుతాడు అని సక్సెస్ అవ్వాలి అని కోరుకున్న వ్యక్తులలో ప్రముఖంగా వినిపించే పేర్లలో బండ్ల గణేష్ కూడా ఒకరు ఫైనల్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం లో భారీ మెజారిటీతో గెలుపొందారు . ఆ విన్నింగ్ మూమెంట్‌ను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే బండ్ల గణేష్ మాత్రం ఆ విన్నింగ్ మూమెంట్ ను ఎంజాయ్ చేయలేకపోతున్నాడు .
బండ్ల గణేష్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. దీంతో ఎన్నికల ఫలితాల వేళ ఆయన మాటలు ఆయన చెప్పే డైలాగ్స్ ఆయన చూపించే ప్రేమ మిస్ అయిపోతున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బండ్ల గణేష్ ఆక్టివ్ గా ఉంటే పవన్ కళ్యాణ్ గెలిచిన సందర్భంగా .. ఎలాంటి హై పెర్ఫార్మెన్స్ ఇచ్చేవారు.. హై వోల్టేజ్ స్పీచ్ రిలీజ్ చేసేవారు అనేది ..అందరికీ తెలిసిందే . దేవర ..దేవుడు .. పవనిజం.. పవనసేన అంటూ చాలా చాలా బోల్డ్ బోల్డ్ గా ఉన్నది ఉన్నట్లు మాట్లాడేసేవాడు . దీంతో సోషల్ మీడియాలో ఆయనను మిస్ అవుతున్నట్లు ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . మీరు త్వరగా పూర్తిగా ఆరోగ్యవంతంగా కోల్కొని పవన్ కళ్యాణ్ విన్నింగ్ మూమెంట్స్ ని ఎంజాయ్ చేయాలి అంటూ కోరుకుంటున్నట్లు ట్వీట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్వీట్స్ వైరల్ గా మారాయి..!!