ఈ క్యూట్ బుజ్జయి సౌత్ స్టార్‌ హీరోయిన్.. ఒక్కో మూవీకి రూ. 4కోట్ల రెమ్యూనరేషన్.. ఎవరో గుర్తుపట్టారా..?!

సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్టార్ హీరో హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకోవాలంటే ఆహర్నిశలు శ్రమించాల్సి ఉంటుంది. ఎన్నో అడ్డంకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. టాలెంట్ ఉన్నా కూడా కాసంత అదృష్టం కూడా ఉంటేనే ఇక్కడ స్టార్ డ్రంలో సంపాదించుకొని కొనసాగగలుగుతారు. ఇక ఒకసారి స్టార్ సెలబ్రిటీస్ గా పేరు సంపాదించుకున్నతర్వాత ఆ స్టార్‌డం నిలబెట్టుకోవడానికి కూడా ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అలా ఇప్పటికే చాలామంది నటీనటులు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి స్టార్ హీరో, హీరోయిన్లుగా మారారు. వారి క‌ల‌లను శాక్రిఫైజ్ చేసి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి రాణిస్తున్నారు.

Kajal Aggarwal Childhood Photos

అలాంటివారిలో ఈ పైఫోటోలో ఉన్న చిన్న‌ది కూడా ఒక‌టి. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.. ప్రస్తుతం ఈమె టాలీవుడ్ టాప్ హీరోయిన్. సినిమాకు రూ.4 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటూ దూసుకుపోతున్న ఈ అమ్మ‌డు పెళ్లై బాబు ఉన్నప్పటికీ ఇంకా అదే క్రేజ్‌తో కొనసాగుతుంది. ఇప్పటికైనా ఆమె ఎవరో చెప్ప‌గ‌ల‌రా.. ఎస్ మీరు అనుకున్నది నిజమే. ఆమె కాజల్ అగర్వాల్. మొదట్లో కాజల్ సినిమా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాలని భావించలేదట. ఎంబీఏ ని చదివి.. ఎల్ఎంలో చేరాలని ఎన్నో కలలు కనేదట‌. ముంబైలోని కేసి కాలేజ్ నుంచి మార్కెటింగ్ అడ్వర్టైజింగ్ స్పెషలైజేషన్ తో మాస్ మీడియా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన అమ్మడు కాలేజీలో ఉండగానే అవకాశాలు రావడంతో సినీరంగ ప్రవేశం చేసింది.

Gorgeous 😍😘♥️❤️💖💗💓💝💟❣️💞💕 @kajalaggarwalofficial | Instagram

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత కాజల్ నటించిన లక్ష్మి కళ్యాణం తో ఛాన్స్ అందుకుని టాలీవుడ్‌కు పరిచయం అయింది. ఇక ఈ సినిమాకు పాజిటివ్ టాక్ దక్కడంతో కాజ‌ల్‌కు మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత తెలుగులో వరుస ఆఫర్లు క్యూ క‌ట్టాయి. ఇక తన కల ఐఏఎం ను వదిలిపెట్టి ఇండస్ట్రీలో రాణిస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడం ఆస్తులు రూ.80 కోట్ల పైచిలుకు అని తెలుస్తుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అన్ని సినిమాల్లో నటించి మెప్పించిన కాజల్ తెలుగు ప్రేక్షకుల్లో మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇప్పుడు ఇండియన్ 2, తో పాటు లేడి ఓరియంటెడ్ మూవీ సత్యభామ సినిమాలో నటించింది. ఈ సినిమా జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.