సీక్రెట్ గా పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చిన జబర్దస్త్ లేడీ కమెడియన్..!!

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సీరియల్ యాక్టర్ ,జబర్దస్త్ కమెడియన్ రీతూ చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.. యాంకర్ గా మొదట తన కెరీర్ను ప్రారంభించి ఆ తర్వాత మోడల్ గా ఎంట్రీ ఇచ్చింది అనంతరం ప్రదీప్ యాంకర్ గా వ్యవహరించిన పెళ్లిచూపులు ప్రోగ్రాం ద్వారా ఆకట్టుకుంది. ఆ వెంటనే ఈమెకు గోరింటాకు అనే సీరియల్ లో నటించే అవకాశం వచ్చిందట. ఆ తర్వాత వరుసగా అవకాశాలు రావడంతో అటు బుల్లితెరపై పలుషోలలో కూడా కనిపిస్తూ ఉండేది రీతూ చౌదరి.

ఈ క్రమంలోనే అడపా దడపా సినిమాలలో సైతం నటించిన ఆ తర్వాత జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన రీతూ చౌదరి బాగానే సంపాదించుకుంది. అంతేకాకుండా సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టి అందులో పలు రకాల వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది రీతూ చౌదరి. ఇటీవల కాలంలో వరుసగా సోషల్ మీడియాలో పలు రకాల గ్లామర్ ఫోటోలను షేర్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఈ నేపథ్యంలోని సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియో చూసి నేటిజన్స్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

ఈ వీడియోలో రీతూ చౌదరి పెళ్లి వీడియోని షేర్ చేయడం జరిగింది. ఇటీవల తన ప్రియుడితో కలిసి దిగిన ఫోటో ని షేర్ చేసిన ఈమె పెళ్లి వేడుకలు వీడియోలో కనిపించడంతో పెళ్లి చేసుకుందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఈమె పెళ్లికూతురు దుస్తులలో స్నానం చేస్తూ పసుపు గంధంతో స్నానం చేయిస్తున్నారు.. అయితే రీతూ చౌదరి ఈ వీడియోకి ఇచ్చిన వివరణ చదివాక అసలు విషయం అర్థం అయింది.. అదేమిటంటే ఆన్ స్క్రీన్ పెళ్లిళ్లు క్రేజీగా ఉంటాయని కామెంట్స్ చేసింది..అయితే ఇది షూటింగ్లో భాగంగా జరుగుతున్న పెళ్లా నిజమైన పెళ్ళా అనే విషయం అర్థం కావడం లేదు.

 

View this post on Instagram

 

A post shared by Rithu_chowdary (@rithu_chowdhary)