“అది నా పిల్ల రా “..సోషల్ మీడియాని షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ ఎమోషనల్ ట్వీట్.. ఫ్యాన్స్ ఫిదా..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోకి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా పెళ్లి చూపులు సినిమాతో ఫుల్ క్లాసిక్ అండ్ లవబుల్ హీరోగా పేరు సంపాదించుకున్న విజయ్ ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో తన రూట్ నే మార్చేసాడు . రౌడీ హీరోగా ట్యాగ్ చేయించుకుని స్టార్ సెలబ్రిటీస్ ని సైతం ఫిదా చేసేసాడు . రీసెంట్ గా ఆయన నటించిన సినిమా ఖుషి . ఈ సినిమాలో హీరోయిన్గా సమంత నటించింది .

ఈ సినిమాను శివ నిర్వాణ తనదైన స్టైల్ లో డైరెక్ట్ చేశాడు. కాగ సెప్టెంబర్ ఒకటిన గ్రాండ్గా థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోని సినిమా ప్రమోషన్స్ చురుగ్గా పాల్గొంటున్న విజయ్ దానికి సంబంధించిన పనులను ఏమాత్రం నెగ్లెట్ చేయట్లేదు. ఇలాంటి క్రమంలోనే విజయ్ దేవరకొండ మార్క్ డైలాగ్ ” అది నా పిల్ల” అనేది ఓ ఎమోషన్ అంటూ ట్విట్ చేశాడు . విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాలో “అది నా పిల్ల రా ” అంటూ చాలా బోల్డుగా డైలాగులు చెప్తాడు.

మళ్ళీ ఖుషి సినిమాలో సైతం అదే డైలాగ్ యూస్ చేశాడు విజయ్ దేవరకొండ. అయితే అంతకుముందే విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన బేబీ సినిమాలో” అది నా పిల్లరా” అంటూ చాలా ఎమోషనల్ గా చెప్పుకొస్తాడు . దీంతో సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్‌స్ క్రియేట్ చేశారు మీమర్స్..అదే ట్వీట్ ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ “అది నా పిల్ల ” అనేది ఎమోషన్ అంటూ లవ్ సింబల్ ని షేర్ చేశారు . చాలా ఎమోషనల్ టచ్ ఇది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు విజయ్ దేవరకొండ ఇలా చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!