తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోయిన్స్ సైతం ఎంట్రీ ఇస్తున్నారు. అలాంటి వారిలో హీరోయిన్ మేఘ ఆకాష్ కూడా ఒకరు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లలో కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతూ ఉండగా మరి కొంతమంది ఫెడవుట్ అవుతూ ఉన్నారు. మేఘ ఆకాశ 2017 లో మొదటిసారి నితిన్ తో కలిసి లై సినిమాలో నటించింది.ఆ తర్వాత నితిన్ తో కలిసి మళ్ళీ చల్ మోహన్ రంగా సినిమాలో నటించగా ఈ రెండు కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఆ తర్వాత పేట సినిమాలో నటించింది.
ఈమె నటించిన సినిమాలన్నీ కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో ఈమేకు గుర్తింపు రాలేదు.రవితేజ నటించిన రావణాసుర సినిమాలో నెగటివ్ పాత్రలో నటించింది. ఈ సినిమా తర్వాత మరే ప్రాజెక్టును కూడా ఈమె అనౌన్స్మెంట్ చేయలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ ముద్దుగుమ్మ త్వరలోనే వివాహం చేసుకోబోతోందనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. తమిళనాడుకు చెందిన రాజకీయ నాయకుడు కుమారుడితో మేఘ ఆకాశ వివాహం ఫిక్స్ అయినట్లుగా కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
వీరిది పెద్దలు కుదిర్చిన వివాహమా ప్రేమ వివాహమా అనే విషయంపై ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఇప్పటివరకు ఈ వార్తలపై మేఘ ఆకాష్ కూడా స్పందించలేదు. ఇటీవల ఈ ముద్దుగుమ్మ బూ అనే చిత్రంలో నటించింది. అలాగే హిందీలో సల్మాన్ ఖాన్ నటించిన రాదే చిత్రంలో కూడా కీలకమైన పాత్రలో నటించినట్లు తెలుస్తోంది. అవకాశాలు బాగానే వస్తున్న సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోతోంది మేఘ ఆకాశ. ఈమె నటించిన మను చరిత్ర అనే సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది.
View this post on Instagram