డ‌బ్బుకు క‌క్కుర్తి ప‌డి అలాంటి త‌ప్పు చేస్తున్న శ్రీ‌లీల‌.. తేడా వ‌స్తే స‌ద్దుకోవాల్సిందే!

శ్రీలీల.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ యాంగ్‌ బ్యూటీ పేరు మారుమోగిపోతుంది. వచ్చి రెండేళ్లు కాకముందే దాదాపు ప‌ది ప్రాజెక్టులతో యమ జోరు చూపిస్తుంది. శ్రీ‌లీల‌ ఇప్పటివరకు తెలుగులో చేసింది రెండు చిత్రాలే. అందులో పెళ్లి సందడి హిట్ అవ్వగా.. ధ‌మాకా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఈ రెండు సినిమాల ద్వారా శ్రీలీల యూత్ లో విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకుంది. తనదైన అందం నటనతో పాటు డాన్సులతో ఓవర్ నైట్ స్టార్ గా మారింది.

దీంతో అటు స్టార్ హీరోల‌తో పాటు ఇలు యంగ్ హీరోల క‌ళ్లు కూడా శ్రీ‌లీల పైనే ప‌డ్డాయి. భారీ రెమ్యున‌రేష‌న్ ఆఫ‌ర్ చేయ‌డంతో శ్రీ‌లీల కూడా వారు వీరు అనే తేడా లేకుండా అంద‌రి సినిమాల‌కు ఒప్పేసుకుంటుంది. ఇప్పుడీ విష‌య‌మే అభిమానుల‌ను క‌ల‌వ‌ర పెడుతోంది. శ్రీ‌లీల కంటే ముందు కృతి శెట్టి కూడా ఆరంభంలో ఇదే జోరును చూపించింది. ఉప్పెన ఘ‌న విజ‌యం త‌ర్వాత కృతి శెట్టికి ఆఫ‌ర్లు క్యూ క‌ట్టాయి. దాంతో క‌థ‌ల విష‌యంలో ఆలోచించ‌కుండా వ‌చ్చిన ప్ర‌తి సినిమాకు సైన్ చేసింది. క‌ట్ చేస్తే.. వ‌రుస ఫ్లాపుల‌తో ఘోరంగా స‌త‌మ‌తం అవుతోంది.

ఇక ఇప్పుడు శ్రీ‌లీల కూడా కృతి శెట్టిన చేసిన త‌ప్పే చేస్తుంద‌ని చాలా మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు. భారీ రెమ్యున‌రేష‌న్ ఆఫ‌ర్ చేస్తుండ‌టంతో.. డ‌బ్బుకి క‌క్కుర్తి ప‌డి వ‌చ్చిన ప్ర‌తి ఆఫ‌ర్ కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చుకుంటూ పోతుంద‌ని అంటున్నారు. క‌థ గురించి ప‌ట్టుకోకుండా శ్రీ‌లీల పెద్ద తప్పు చేస్తుంద‌ని.. ఏదైనా తేడా వ‌స్తే ఇండ‌స్ట్రీలో దుకాణం సద్దుకోవాల్సిందే అని చ‌ర్చించుకుంటున్నారు.