నటసింహం నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో `ఎన్‌బీకే 108` వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో అందాల చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తే.. యంగ్ బ్యూటీ శ్రీలీల, శరత్‌బాబు తదితరులు కీలక పాత్రలను పోషించారు.
షైన్ స్క్రీన్స్ బ్యానర్ సాహో గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. తమన్ స్వరాలు అందిస్తున్నాడు. అయితే జూన్ 10వ తేదీన బాలయ్య బర్త్‌డే కావడంతో.. రెండు రోజుల ముందే `ఎన్‌బీకే 108` మేకర్స్ నందమూరి ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. తాజాగా ఈ మూవీ టైటిల్ ను రివీల్ చేశారు. ఈ సినిమాకు `భగవంత్ కేసరి` అనే డిఫరెంట్ టైటిల్ ను లాక్ చేశారు. `అన్న దిగిండు.. ఇగ మాస్ ఊచకోత షురూ` అంటూ ఈ మేరకు ఓ పోస్టర్ ను బయటకు వదిలారు.
ఈ పోస్టర్ లో బ్రౌన్ కలర్ కుర్తా, ఫార్మల్ ప్యాంట్ ధరించి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో బాలయ్య ఆకట్టుకున్నాడు. ఓ యాక్షన్ సీక్వెన్స్ లో ఉన్న ఫొటోను పోస్టర్ లో ఉంచారని స్పష్టంగా అర్థమవుతోంది. ఇక మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. బాలయ్య 108 మూవీ కాబట్టి.. 108 లొకేషన్లలో.. 108 హోర్టింగ్స్ మీద ఈ టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలో ఎప్పుడు లేని విధంగా జరగలేదని చెప్పాలి. ఇక జూన్ 10న భగవంత్ కేసరి మూవీ మరో సర్‌ప్రైజ్ ఉండబోతోందని తెలుస్తోంది.