కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి కేజిఎఫ్ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమా పెను సంచలనాన్ని సృష్టించింది. ఈ సినిమాని డైరెక్టర్ ప్రశాంత నీల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎండింగ్లో పార్ట్-3 ఉంటుందని చూపించడంతో అభిమానులు పార్ట్-3 కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కే జి ఎఫ్ త్రీ కూడా ఉంటుందని డైరెక్టర్ ప్రశాంత్ నిల్ గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది.
ఈ సందర్భంగా కేజిఎఫ్ చాప్టర్-2 విడుదలై బాక్సాఫీస్ వద్ద క్రియేట్ చేసి ఏడాది పూర్తి కావడంతో ఒక స్పెషల్ వీడియోని కూడా హోంభలే ఫిలిమ్స్ వారు విడుదల చేయడం జరిగింది.. ఈ వీడియోలో రాఖీ బాయ్ 1978 నుంచి 1981 వరకు ఎక్కడున్నారు అనే విషయాన్ని సూచిస్తూ ఆసక్తి రేపే విధంగా ఒక వీడియోని తమ ట్విట్టర్ ద్వారా షేర్ చేయడం జరిగింది.. రాఖీ భాయ్ వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాటని పూర్తిగా నెరవేరింది అనేదాని పైన సందేహం కలిగించే ఈ అంశాన్ని కేజిఎఫ్ -3 లో చూపించబోతున్నట్లు ఈ వీడియోని సైతం కట్ చేయడం జరిగింది.
దీంతో కేజిఎఫ్ చాప్టర్-3 పైన అధికారికంగా ప్రకటన వెలుబడినట్లే అంటూ అభిమానులు సైతం గత సంబరపడిపోతున్నారు. అయితే ఇది ఎప్పుడు ప్రారంభం అవుతుందా అనే విషయంపై ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు ఇటీవలే ఇండియా టుడే కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రవినా టాండన్ కూడా kgf -3 ఉంటుందని మేము అతి త్వరలోనే దానిపైన పనిచేస్తామని కూడా వెల్లడించింది ఈ క్రమంలోనే చాప్టర్ అందడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ప్రశాంత్ నిల్ ప్రభాస్ తో సలార్ సినిమా తెరకెక్కిస్తున్నారు ఈ సినిమా అయిపోయిన వెంటనే ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయవలసి ఉంది.. ఇప్పటికీ కూడా హీరో యశ్ తన తదుపరి ప్రాజెక్టును కూడా ప్రకటించలేదు దీంతో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.
The most powerful promise kept by the most powerful man 💥
KGF 2 took us on an epic journey with unforgettable characters and action. A global celebration of cinema, breaking records, and winning hearts. Here's to another year of great storytelling! #KGFChapter2#Yash… pic.twitter.com/iykI7cLOZZ
— Hombale Films (@hombalefilms) April 14, 2023