పుష్ప రాజ్ వచ్చిండురోయ్ .. ఇక రూల్ మారాలి..రూలింగ్ మారాలి.. బొక్కలు ఇరుగుతయ్ బిడ్డా..జాగ్రత్త..!!

పుష్ప.. పుష్పరాజ్ .. ఈ డైలాగు విన్న ప్రతిసారి మనకు తెలియకుండానే గూస్ బంప్స్ వచ్చేస్తూ ఉంటాయి. అలాంటి ఒక క్రేజీ డైలాగ్ ని జనాలకి ఇచ్చాడు డైరెక్టర్ సుకుమార్ . ఇప్పటివరకు సుకుమార్ తన సినిమాలో ప్రతిదీ లెక్కల పరంగానే తీసుకెళ్లాడు . ఆయన కెరియర్ స్టార్టింగ్ నుంచి నిన్న కాక మొన్న రిలీజ్ అయిన రంగస్థలం వరకు అన్ని క్యాలిక్యులేషన్స్ ఈక్వల్ గా బ్యాలెన్స్ చేస్తూ వచ్చారు . కానీ పుష్ప సినిమాలో మాత్రం క్యాలిక్యులేషన్స్ పరంగా కాదు కంటెంట్ పరంగా మాస్ లుక్స్ ను ఎక్కువగా ఎలివేట్ చేశాడు .

పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఎంత వైల్డ్ మాస్ యాంగిల్ లో కనిపించాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇప్పటికీ పుష్ప వన్ సినిమాకి సంబంధించిన పోస్టర్స్ వైరల్ అవుతూనే ఉన్నాయి.. అంటే దానికి కారణం బన్నీ మాస్ అవతారం. బన్ని పుట్టిన రోజు సందర్భంగా పుష్ప2 సినిమాకి సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. మరీ ముఖ్యంగా టీజర్ ఎండింగ్లో బన్నీ ఇది పుష్ప గాడి రూల్ అంటూ చెప్పినా బోల్డ్ వాయిస్ లో డైలాగ్ ప్రెసెంట్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.

ఇదే డైలాగ్ ని పట్టుకొని బన్నీ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో బన్నీని ఏడిపించిన వాళ్లని టార్గెట్ చేస్తున్నారు. మనకు తెలిసిందే నిన్న మొన్నటి వరకు కూడా బన్నీకి ఓ స్టార్ హీరోతో విభేదాలు ఉన్నాయని సదరు స్టార్ హీరోస్ బన్నీని నానా రకాలుగా ట్రోల్ చేశారు . అయితే వాళ్ళకి ఇచ్చి పడేస్తూ బన్నీ ఫాన్స్ అయితే పుష్ప గాడు ఎంటర్ అయ్యాడు. ఇక రికార్డులు బద్దలు అవ్వాల్సిందే . రూల్ మారాలి రూలింగ్ మారాలి ..కాదు కూడదు అని ఎవరైనా సరే తోక జాడించారా.. బొక్కలు ఇరుగుతాయ్ బిడ్డ.. అంటూ ఘాటుగా సినిమాలోని డైలాగ్స్ తో కౌంటర్స్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే పుష్ప సినిమాకి సంబంధించిన హాష్ ట్యాగ్స్ – డైలాగ్స్ – పోస్టర్స్ వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా సరే ఒక్క ముక్కలో ఈసారి పుష్ప2 సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగ రాస్తుంది అంటూ చెప్పకనే చెప్పేశాడు సుకుమార్ . చూడాలి మరి పుష్ప 2 ఏవిధంగా బాక్సాఫీస్ ని షేక్ చేస్తాడో..?