అల్లు అర్జున్ ఫ్యాన్స్ కని విని ఎరుగని సర్ ప్రైజ్.. పుట్టిన రోజుకి కొద్ది గంటల ముందే మరో పండగ చేసుకునే న్యూస్..!!

ఎస్ .. ఇది నిజంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించే న్యూస్ అనే చెప్పాలి. కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న పుష్ప2 సినిమాకి సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేశారు చిత్ర బృందం . టాలీవుడ్ స్టార్ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్న సుకుమార్ ఎంతో కష్టపడి ఇష్టంగా తీసిన సినిమా పుష్ప . ఈ సినిమా టాలీవుడ్ లెక్కలను తిరగరాసేసింది. కాగా ఈ సినిమా స్టార్టింగ్ నే పుష్ప2 కూడా ఉండబోతుంది అంటూ క్లియర్ గా చెప్పేసాడు సుకుమార్ .

ఈ క్రమంలోనే రీసెంట్గా బన్ని పుట్టినరోజు సందర్భంగా పుష్ప 2 కి సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేశారు టీం. మూడు నిమిషాల టీజర్ తోనే గూస్ బంప్స్ తెప్పించాడు సుకుమార్ . అల్లు అర్జున్ ఆయన ఫ్యాన్స్ కు మరో బిగ్ సర్ప్రైజ్ ఇవ్వడానికి సర్వం సిద్ధం చేసుకున్నాడు . అయితే కొందరు లీకు రాయుళ్లు ఆ సర్ ప్రైజ్ ని ముందుగానే అభిమానులకి షేర్ చేసేసారు. ఇక్కడ మీరు చూస్తున్న ఈ పిక్ లో ఉన్నది ఎవరో కాదు ..టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఇలా చూసిన ఎవరైనా సరే బన్నీ ఫాన్స్ కూడా ఆశ్చర్య పోవాల్సిందే .

ఇది మన అల్లు అర్జున్ నా..? అని అనుకోవాల్సిందే . అంతలా పూర్తిగా తన లుక్స్ ను మార్చేశాడు . అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప2 సినిమాలో బన్నీ పోలీసుల దగ్గర నుండి తప్పించుకోవడానికి రకరకాలుగా వేషాలు వేస్తారట . ఈ క్రమంలోని ఇది వన్ ఆఫ్ ద టాప్ గెటప్ అంటూ చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ నిజంగానే చీర కట్టుకొని ముఖానికి రంగులు పూసుకుని, ముక్కు పుడక, మెడలో బత్తాయి కాయల దండ, పులదండ, నగల హారాలు ధరించి చీరకట్టుకుని కండలు తిరిగిన దేహంతో, చేతిలో తుపాకి పట్టుకుని కోపంతో కనిపిస్తున్నాడు బన్నీ.

ఇలాంటి ఓ పోస్టర్ని అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేస్తే ఆ కిక్కే వేరు.. అయితే ఎవరో కొందరు ఆకతాయి అల్లు అర్జున్ పిక్స్ ని ముందుగానే సోషల్ మీడియాలో లీక్ చేసేసారు . ఈ క్రమంలోని పుట్టినరోజుకి కొద్ది గంటల ముందే అల్లు అర్జున్ అభిమానులకి మరో పండగ చేసుకునే లుక్ ను అందించేశారు. ప్రజెంట్ సోషల్ మీడియాలోనే కాదు పాన్ ఇండియా లెవెల్ లో అల్లు అర్జున్ పిక్ వైరల్ అవుతుంది..!!