మహేళలను కించపరుస్తూ మాస్ మహారాజా రవితేజ నోరు జారారు. ఇదే ఇప్పుడు వివాదం అయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రవితేజ నేడు `రావణాసుర` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో క్రైమ్స్ కి పాల్పడే క్రిమినల్ లాయర్ గా రవితేజ నటించాడు.
వైలెన్స్, అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉండటంతో సెన్సార్ వద్ద `ఏ` సర్టిఫికేట్ సొంతం చేసుకున్న ఈ చిత్రం.. నేడు అట్టహాసంగా విడుదలైంది. ఆల్మోస్ట్ అన్ని వైపుల నుంచి ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయిది. ఇదిలా ఉంటే.. ఎడిట్ సూట్ నుంచి 9 సెకన్ల నిడివి ఉన్న వీడియో లీక్ కాగా అంతర్జాలంలో ఇది డిబేట్ కి తెర తీసింది.
లీక్డ్ వీడియోలో రవితేజ `కంచం ముందుకి మంచం మీదకి ఆడపిల్లలు పిలవంగానే రావాలి. లేకపోతే నాకు మండుద్ది రా` అని ఒక అమ్మాయితో కోపంగా అంటాడు. ఈ డైలాగే వివాస్పదం అయింది. ఆడవాళ్లను కించ పరిచే విధంగా ఆ డైలాగ్ ఉందంటూ నెటిజన్లు ఏకేస్తున్నారు. సెన్సార్ సభ్యులు ఇలాంటి బూతు డైలాగ్ కి ఎందుకు కట్ చెప్పలేదంటూ మండిపడుతున్నారు. సినిమాలో ఆ డైలాగ్ ను తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
Just in: A scene from Ravi Teja's upcoming movie #Ravanasura has surfaced on social media, causing a stir among fans. The movie, set to release worldwide tomorrow, is said to be a shocking watch.
@RaviTeja_offl @SureshKondi_
#RaviTeja #Tollywood" pic.twitter.com/YX3oZ7nyMq— Prabhakar (@prabhakartv9) April 6, 2023