పవన్ ఓకే అంటే చేస్తా.. మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్..!!

సినీ ఇండస్ట్రీలో ఉండే నటీనటుల మధ్య రిలేషన్స్ , స్నేహబంధం అనేది ఎప్పుడు ఉండనే ఉంటుంది. అప్పుడప్పుడు కొన్నిసార్లు మనస్పర్ధలు కూడా వస్తూ ఉంటాయి. అలా మంచు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ మధ్య గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.. అయినా కూడా మోహన్ బాబు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ రెండు కూడా సన్నిహిత్యంగా ఉంటాయని తెలియజేస్తూ ఉంటారు.. పవన్ కళ్యాణ్ మొదట దర్శకత్వ శాఖలో పనిచేశారు ఆ తరువాత నటుడుగా ఎంట్రీ ఇచ్చారు.

మోహన్ బాబు విలన్ గా కమెడియన్గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు.. అలాగే నిర్మాతగా పలు విద్యాసంస్థల అధినేతగా రాజకీయ నాయకుడుగా కూడా బాగా పాపులర్ అయ్యారు మోహన్ బాబు.. పవన్ కళ్యాణ్ కూడా స్టార్ హీరోగా పేరు సంపాదించారు. అప్పుడప్పుడు మోహన్ బాబు, పవన్ కళ్యాణ్ మధ్య మాటలు వైరల్ గా మారుతూ ఉంటాయి. వజ్రోత్సవ వేడుకలలో పవన్ కళ్యాణ్ మోహన్ బాబు పై చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.. మంచు ఫ్యామిలీ మధ్య విభేదాలు వచ్చాయని సమాచారం.

చిరంజీవి మోహన్ బాబు మాత్రం మేమిద్దరం మంచి స్నేహితులమే అంటూ తెలియజేస్తూ ఉంటారు.. గత ఎడాది పవన్, మోహన్ బాబు పై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బంధువు మోహన్ బాబు సినీ పరిశ్రమలోని ఇబ్బందులను ఆయన జగన్మోహన్ రెడ్డికి చెప్పాలని తెలిపారు.. ఈ వాక్యాలపై మోహన్ బాబు అప్పట్లో స్పందించారు. ఈ విషయాన్ని నేను హృదయపూర్వకంగా సమాధానం చెబుతున్నారని తెలిపారు.

Pic Talk: Manchu Hero Meets Pawan Kalyan

ఆ సమయంలో మంచు మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ కూడా పవన్ కళ్యాణ్ పార్టీలు చేరబోతున్నారని వార్తలు వినిపించాయి.. తిరుపతి నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వినిపించాలి.. కానీ అవన్నీ కాసేపు కానీ మిగిలాయి ఇటీవల మోహన్ బాబు మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ పిలవగానే ఎలాంటి పాత్ర అయినా చేస్తానని చెప్పారు.. మరి జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తారా అనే ప్రశ్న ఎదురవగా.. సినిమాలు వేరు రాజకీయాలు వేరని చెప్పేశారు మోహన్ బాబు పవన్ అంటే తనకు ఇష్టం మాత్రమే అంటూ తెలిపారు.