విశ్వక్ సేన్ హీరోగా నటించిన “దాస్ కా ధమ్కీ” సినిమా తాజాగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాపై ప్రేక్షకులకు నుంచి రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. కొంతమంది ఈ సినిమాపై పాజిటివ్‌గా స్పందిస్తుంటే మరికొంతమందేమో నెగిటివ్ గా స్పందిస్తున్నారు. దాస్ కా ధమ్కీ సినిమా ట్రైలర్ చూసిన తరువాత సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. అయితే మాస్ ప్రేక్షకులను మాత్రం ఈ సినిమా అలరిస్తుంది. ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన నివేదా పేతురాజ్ హీరోయిన్గా నటించింది.
దాస్ కా ధమ్కీ సినిమాలోని పాటలు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అయితే సినిమా రిలీజ్ అయిన కొన్ని చోట్ల ప్రేక్షకులు సినిమాపై తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా లో విశ్వక్, నివేదా నటన చాలా బాగుందని కొంతమంది అంటున్నారు. “ఆల్మోస్ట్ పడిపోయానే” సాంగ్ బాగుంది అని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా సినిమా స్టోరీ కాస్త కొత్తగా వుందని చెప్తున్నారు ప్రేక్షకులు. ఈ సినిమాలో కామెడి, సాంగ్స్, విశ్వక్ నటన సినిమాకి హైలెట్ గా నిలిచాయని అంటున్నారు.
ఫస్టాఫ్‌లో దాస్ పాత్ర, క్యారెక్టరైజేషన్ చక్కగా చేసారని.. విశ్వక్సేన్ వెయిటర్ పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడని అంటున్నారు. తన బాడీ లాంగ్వేజ్, యూత్ సెంట్రిక్ డైలాగ్స్‌తో విశ్వక్సేన్ ఇంటర్వెల్ వరకు మంచి వినోదాన్ని పెంచాడని పేర్కొన్నారు. దాస్‌కి సైడ్కిక్లుగా హైపర్ ఆది, మహేష్ అద్భుతమైన కామెడీ చేసి నవ్వించారట.
అలానే ఈ సినిమాలో లాజిక్ లేకుండా కొన్ని సీన్స్ ఉన్నాయని, కథ రొటీన్ గా ఉండటం సినిమాకి మైనస్ పాయింట్ అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉగాది పండుగకు మంచి సినిమా చూడాలని భావించే వాళ్లకు ఈ సినిమా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇక దాస్ కా ధమ్కీ ఫుల్ రన్ లో ఏ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. అయితే చాలా మంది విశ్వక్ ఖాతాలో హిట్ చేరినట్టేనని చెబుతున్నారు.