భర్తలు చనిపోయిన రెండో పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటున్న స్టార్ హీరోయిన్లు వీరే..!

చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్లు పరిచయమై ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలా వారి కెరీర్ మంచి పీక్స్‌లో ఉన్న సమయంలోనే కొందరు ప్రేమించి పెళ్లి చేసుకుంటే మరి కొంతమంది పెద్దలు కుదిరిచిన పెళ్లి చేసుకున్నారు. వారిలో మరి కొంతమంది అయితే రెండో పెళ్లి వారిని కూడా వివాహం చేసుకున్నారు. ఇదిలా ఉంటే చాలామంది స్టార్ హీరోయిన్లు వారి భర్త మరణించి చాలా కాలం అవుతున్నా కూడా ఇప్పటికీ రెండో పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటూ తమ పిల్లల్ని చూసుకుంటున్నారు. మరి ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటున్న స్టార్ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

Bhanupriya Birthday: 80 के दशक की इस एक्ट्रेस ने फैमिली के खिलाफ की शादी,  तलाक के बाद अब अकेले पाल रही बेटी | 80s Actress Bhanupriya married against  the family and got

భానుప్రియ: 80,90వ దశకంలో సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది భానుప్రియ. ఈమె టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు అందరు స్టార్ హీరోలతో నటించింది. భానుప్రియ కెరియర్ మంచి ఫామ్‌లో ఉన్న సమయంలోనే ఆదర్శ కౌశల్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. భానుప్రియ భర్త కౌశల్ మరణించాక కూడా ఆమె ఇప్పటికీ కూడా రెండో పెళ్లి చేసుకోకుండా తన జీవితాన్ని కొనసాగిస్తుంది.

Actress Disco Shanti Family Photos Photos - FilmiBeat

డిస్కో శాంతి: సిల్క్ స్మిత తరవాత ఐటెం సాంగ్‌ల‌కి పెట్టింది పేరుగా డిస్కో శాంతి మారిపోయింది. ఈమె టాలీవుడ్ రియల్ స్టార్ విలక్షణ నటుడు శ్రీహరిని పెళ్లి చేసుకుంది. శ్రీహరి మరణించి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా డిస్కో శాంతి రెండో పెళ్లి చేసుకోకుండా తన కొడుకులతోనే తన జీవితాన్ని కొనసాగిస్తుంది.

Star Heroine's

మీనా: సీనియర్ స్టార్ హీరోయిన్ మీనా భర్త గత సంవత్సరమే పోస్ట్ కోవిడ్ లక్షణాలతో మరణించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఆమె భర్త చనిపోయి ఇన్ని రోజులు అవుతున్నా కూడా మీనా రెండో పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదట.

Viral Pics: Have you seen Raghuvaran-Rohini's son who is all grown up now?  - We Magazine Simple And Sensible

రోహిణి: ఎన్నో చిత్రాల్లో ఎంతో అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్న హీరోయిన్ రోహిణి అవకాశాలు తగ్గాక సెకండ్ ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టి అమ్మ, అత్త వంటి పాత్రల్లో నటిస్తూ మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే రోహిణి స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ మరియు విలన్ రఘువరన్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే తన భర్త రఘువరన్ మరణించక కూడా రోహిణి భర్తను తలుచుకుంటూ తన కొడుకుని పెద్దవాడిని చేసి మరో పెళ్లి చేసుకోకుండా తన జీవితాన్ని కొనసాగిస్తుంది.

On their 31st wedding anniversary, Sumalatha pays tribute to her late  husband Ambareesh - Telangana Today

సుమలత: సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సుమలత కూడా కన్నడ స్టార్ హీరో అంబరీష్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే వీరి పెళ్లి అయ్యాక కొన్ని సంవత్సరాలకి భర్త మరణించినా కూడా ఇప్పటికీ తన భర్తను తలుచుకుంటూ రెండో పెళ్లి చేసుకోకుండా తన జీవితాన్ని కొనసాగిస్తుంది. ఇలా వీరే కాకుండా చాలామంది సీనియర్ హీరోయిన్లు వారి భర్త చనిపోయిన కూడా రెండో పెళ్లి చేసుకోకుండా వారి జీవితాన్ని ఒంటరిగానే కొనసాగిస్తున్నారు.