మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై మాస్ ఇమేజ్ను చిరంజీవికి తెచ్చిపెట్టింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ బాబి దర్శకత్వం వహించారు. ఇందులో హీరోయిన్గా శృతిహాసన్ నటించింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా విడుదలై ఇప్పటికి పది రోజులు కావస్తున్న అప్పుడే రూ.200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు అధికారికంగా ప్రకటించడం జరిగింది.
ఈ మేరకు సినిమాలోని చిరంజీవి ఒక కొత్త పోస్టర్ కు కూడా విడుదల చేస్తూ వాల్తేర్ వీరయ్య రూ.200 కోట్ల గ్రాస్ వసూలు చేసిన చిరంజీవి మూడవ సినిమా అంటూ గతంలో ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి సినిమాలు రూ.200 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేశాయి.. మరొకవైపు యుఏఎస్ బాక్సాఫీస్ వద్ద కూడా భారీగానే వసూలు రాబడుతోంది వాల్తేర్ వీరయ్య చిత్రం. ఇప్పటివరకు 2.25 మిలియన్ల కలెక్షన్ రాబట్టినట్లుగా ఈ సినిమా తెలుస్తోంది అమెరికాలో విడుదల చేసిన శ్లోక ఎంటర్టైన్మెంట్ ట్విట్టర్ ద్వారా తెలియజేసినట్లు సమాచారం.
ఈ చిత్రంలో రవితేజ కూడా కీలకమైన పాత్రలో నటించారు. ఈ సినిమా భారీ సక్సెస్ సాధించడానికి రవితేజ కూడా ఒక కారణమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రవితేజ ,చిరంజీవి మధ్య వచ్చే సన్నివేశాలు థియేటర్లలో ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే విధంగా కనిపించాయి. శృతి, కేథరిన్ అందచందాలు ఈ సినిమాకు మరింత ఆకర్షణీయంగా నిలిచాయి. దేవిశ్రీప్రసాద్ మరొకసారి తన మ్యూజిక్‌తో అదరగొట్టేసారని చెప్పవచ్చు.
All records under the brand of Mega⭐ @KChiruTweets 😎
MEGA MASS BLOCKBUSTER #WaltairVeerayya rocking at box office with 200+ Crores Gross worldwide & $2.25M+ in the USA
– https://t.co/KjX8J7HFFi@RaviTeja_offl @dirbobby @shrutihaasan @ThisIsDSP @SonyMusicSouth pic.twitter.com/ShJ6TN2TBN— Mythri Movie Makers (@MythriOfficial) January 23, 2023
Megastar's ACTION PACKED BONANZA CONTINUES at Box Office with 200 CR+ Gross 💥🔥❤️🔥
Watch the MEGA MASS BLOCKBUSTER #WaltairVeerayya 🔥
– https://t.co/KjX8J7HFFi@KChiruTweets @RaviTeja_offl @dirbobby @shrutihaasan @ThisIsDSP @SonyMusicSouth pic.twitter.com/4Ma7Fg21r3— Mythri Movie Makers (@MythriOfficial) January 23, 2023