మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఈమె ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్లైపోయింది. ఇన్నేళ్లలో యాబైకి పైగా సినిమాల్లో నటించిన తమన్నా.. సరైన హిట్ అందుకుని చాలా కాలమే అయింది. ఇటీవల బబ్లీ బౌన్సర్, ప్లాన్ ఏ ప్లాన్ బీ, గుర్తుందా శీతాకాలం చిత్రాలు ప్రేక్షకులను మెప్పించడంలో పూర్తిగా విఫలం అయ్యాయి.
వరుస ఫ్లాపుల నేపథ్యంలో తమన్నా కెరీర్ ఇక ముగిసినట్టే అని అందరూ భావించారు. కానీ, ఈ బ్యూటీకి ఆఫర్లు మాత్రం తగ్గట్లేదు. తాజాగా ఈ జాక్ పాట్ ఆఫర్ ను కొట్టేసింది. అది కూడా మలయాళంలో. అవును, మలయాళం లో `బాంద్రా` అనే సినిమాలో నటించే అవకాశాన్ని తమన్నా అందుకుంది. రామ్ లీలా ఫేమ్ అరుణ్ గోపి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దిలీప్ హీరోగా నటిస్తున్నాడు.
అజయ్ వినాయక నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. త్వరలోనే కేరళలో రెండో షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్లో తమన్నా సైతం పాల్గొనబోతోంది. మలయాళం లో తమన్నాకు ఇదే తొలి చిత్రం. ఇది మంచి విజయం సాధించింది అంటే మలయాళం లో తమన్నాకు మరిన్ని ఆఫర్లు దక్కే అవకాశాలు ఉంటాయి. ఇకపోతే తమన్నా, విజయ్ వర్మ డేటింగ్ వ్యవహారం ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇప్పటి వరకు విజయ్ వర్మతో రిలేషన్ పై తమన్నా నోరు విప్పలేదు.