వాల్తేరు వీరయ్య నుంచి అదిరిపోయే అప్డేట్.. రవితేజ ఎంట్రీ అదుర్స్..!

తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తుండగా ఇందులో కేథరిన్, శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా టైటిల్ సాంగ్ లో చిరు సరసన ఆడి పాడింది ..ముఖ్యంగా ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇకపోతే చిరంజీవి హీరోగా వాల్తేరు వీరయ్య సినిమాని బాలీవుడ్ మూవీ మేకర్ అయిన మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు నిర్మిస్తున్నారు. ఇందులో మాస్ మహారాజా రవితేజ కూడా కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.

సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన విడుదల చేయబోతున్న ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాపై బజ్ పెంచడానికి సినిమాకు సంబంధించిన పోస్టర్లు, గ్లింప్స్ అన్నీ విడుదల చేస్తూ మరింత పాపులారిటీ దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో అతిథి పాత్రలో చేస్తున్న రవితేజ టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసింది . ఫస్ట్ టైం మేక పిల్లల పట్టుకొని పులి వస్తా ఉన్నది అని డైలాగ్ తో ఈ టీజర్ మొదలవుతుంది.

ఈ టీజర్ లో రవితేజ ఒక మేక పిల్లను పట్టుకొని పులిలా ఎంట్రీ ఇవ్వడం నిజంగా సినిమాకి హైలైట్ అని చెప్పాలి. అలాగే మరొక చేతిలో గొడ్డలి.. గొడ్డలితో గ్యాస్ సిలిండర్ను పట్టుకొని నడుచుకుంటూ వస్తుంటే ఆ మాస్ వాకింగ్ స్టైల్ కి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. రవితేజ కూడా ఇందులో తెలంగాణ యాసలో అదరగొట్టేసాడని చెప్పవచ్చు. ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఏదేమైనా రవితేజ ఈ సినిమాలో ముఖ్యపాత్రలో నటించడం స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పవచ్చు.