ఆసక్తికరంగా మారిన విక్రమ్ 61 పోస్టర్.. వీడియో వైరల్..!!

కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన విక్రమ్ ఇప్పటికే పలు విభిన్నమైన చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు .హీరో విక్రమ్ మరొకసారి ప్రయోగాత్మకంగా పాత్రలో నటించబోతున్నారు. డైరెక్టర్ రంజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించి టైటిల్ ను కూడా ప్రకటించడం జరిగింది. ఇక ఈ చిత్రం కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాని స్టూడియోస్ గ్రీన్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో హీరోయిన్గా మాళవిక మోహన్ నటిస్తున్నది. ఈ సినిమాకి తంగలాన్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని నిన్నటి రోజున అధికారికంగా ప్రకటించారు.

Actor Vikram tests positive for coronavirus | The News Minute
ఈ మేరకు సామాజిక మాధ్యమాల ద్వారా తాజాగా ఒక వీడియో క్లిప్ మాత్రం పంచుకోవడం జరిగింది. ప్రచార చిత్రాన్ని తీర్చిదిద్దిన తీరును బట్టి చూస్తే స్వాతంత్రానికి పూర్వం జరిగే కథతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు కనిపిస్తోంది. ఇందులో విక్రమ్ ఒక గిరిజన తెగకు చెందిన నాయకుడి పాత్రలో కనిపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటోంది. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం.

Thangalaan: First look teaser of Vikram, Pa. Ranjith's period drama Tamil  Movie, Music Reviews and News
ఇక విక్రమ్ కూడా నటిచ్చిన గత చిత్రాలు అన్నీ కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. ఇక దీంతో పలు విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. అయినప్పటికీ కూడా విక్రమ్ తను చేసే ప్రయోగాల సినిమాలను మాత్రం వదిలిపెట్టకుండా చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ఈ వీడియో మాత్రం చాలా వైరల్ గా మారుతోంది. మరి సినిమాతో నైనా విమర్శకులకు చెక్ పెడతారేమో చూడాలి విక్రమ్.