రాజకీయాలపై సంచలన ట్వీట్ చేసిన చిరంజీవి..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ యువ హీరోలకు సైతం పోటీగా ఉంటున్నారు. చిరంజీవి ప్రస్తుతం తాను నటించబోతున్న సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే సినిమాలలో మెగాస్టార్ గా రాణించిన చిరంజీవి ఆ మధ్య గత కొన్ని సంవత్సరాల క్రితం రాజకీయాల వైపు కూడా అడుగు వేశారు. ఇక తను ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఎన్నికలలో కూడా పోటీ చేయడం జరిగింది. అయితే ఆ పార్టీని కొన్ని కారణాల చేత కాంగ్రెస్ లోకి విలీనం చేశారు.

Chiranjeevi: Megastar is the president of the Star Hero Fans Association ..  Nettinta Trending | Did you know that Chiranjeevi in ​​his younger days was  president of Superstar Krishna fans association - filmyzoo - Hindisip

సెంట్రల్ మినిస్టర్ గా కొన్ని సంవత్సరాలు సేవలందించారు. ఆ తర్వాత చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటూ తిరిగి సినీ ఇండస్ట్రీలోకి మళ్ళీ ఎంట్రీ ఇచ్చారు. అలా 9 సంవత్సరాలు సుదీర్ఘ విరామం తర్వాత ఖైదీ నెంబర్ 150 చిత్రంతో ఇండస్ట్రీలోకి తిరిగి అడుగు పెట్టారు ఇదంతా ఇలా ఉండగా తాజాగా చిరంజీవి తన ట్విట్టర్ నుంచి పలు ఆసక్తికరమైన కామెంట్స్ చేయడం జరుగుతుంది వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చిరంజీవి వాయిస్ క్లిప్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా హల్ చల్ చేస్తోంది.

ఇక ఆ వాయిస్ క్లిప్ లో చిరంజీవి “నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను.. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు.. అనే డైలాగ్ చెప్పడం జరిగింది. దాంతో ఈ డైలాగ్ ప్రస్తుతం అందరిని ఆసక్తి కల్పించేలా కనిపిస్తోంది.మెగాస్టార్ చిరంజీవి మరొకసారి రాజకీయాల్లోకి రాబోతున్నారని కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు. మరి కొంతమంది చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలోని ఈ డైలాగ్ అయ్యి ఉంటుందని భావిస్తున్నారు. ఏది ఏమైనా చిరంజీవి వాయిస్ తో తన ట్విట్టర్ నుంచి వచ్చిన ఈ ట్విట్ కాస్త రాజకీయాలలో ఇప్పుడు హార్ట్ టాపిక్ గా మారుతోంది.