బ్లెండర్స్ ప్రైడ్ యాడ్ లో సమంత…ఫైర్ అవుతున్న ఫ్యాన్స్ !

టాలీవుడ్ హీరోయిన్స్ లో ఎవరైనా యాడ్స్ లో బిజీగా ఉన్న హీరోయిన్స్ ఎవరంటే ముందు చెప్పుకొనేది సమంత పేరు .సమంత చాల యాడ్స్ చేస్తుంది .తాను చేసిన యాడ్స్ ఎప్పటికప్పుడు తన ఇంస్టాగ్రామ్లో పోస్ట్ చేస్తుంది .రీసెంట్గా చేసిన బ్లండర్ ప్రైడ్ యాడ్ ప్రమోషన్ వీడియో పోస్ట్ చేసింది .దీనిని చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు .

ఆ యాడ్ ప్రమోషన్ వీడియోలో సమంత హాట్ హాట్ కనిపించింది .అయితే అభిమానులు డబ్బు కోసం ఇలాంటి వాణిజ్య ప్రకటనలు చేస్తారా ,మేము మీ ఫిట్ నెస్ వీడియోల నుండి ఎంతో ప్రేరణ పొందాం .అయితే మీరు ఎలాంటి ప్రకటనలు చేస్తారని కామెంట్స్ చేస్తున్నారు .ఇక్కడ ఒక విషయం అర్ధం చేసుకోవట్లేదు అభిమానులు . అయితే నిజానికి సమంత ఆ వైన్ బ్రాండ్ కోసం కాకుండా వారు నిర్వహించే షోల కోసం ప్రచారం చేస్తుంది.