మొత్తం నాశనం చేసేసింది.. సమంత పై ఆ హీరో సంచలన కామెంట్స్..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వరుస సినిమాలతో బిజీ బిజీ గా పరుగులు తీస్తుంది. ఓ పక్క సినిమాలకు సైన్ చేస్తూనే మరో వైపు సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతూ..నెట్టింట హాట్ టాపిక్ గా ఉంటుంది. నిజానికి సమంత ఒకప్పుడు ఇలా సోషల్ మీడియాలో ఎక్కువ టైం గడిపేది కాదు. చాలా తక్కువ టైం సోషల్ మీడియా కి కేటాయించేది. అయితే రీజన్ ఏంటో తెలియదు కానీ సమంత తన భర్త నాగ చైతన్య తో విడాకులు తీసుకోవడానికి సిద్ధపడ్డప్పటి నుండి సోషల్ మీడియాలో యమ యాక్టీవ్ గా ఉంటూ..రోజుకో పోస్ట్ పెడుతుంది.

ఇక సమంత పెట్టిన ఏ పోస్ట్ అయిన సరే అది క్షణల్లో వైరల్ గా మారిపోతుంది. అమ్మడుకున్న క్రేజ్ అలాంటిది మరి. ఫాలోవర్స్ కూడా ఎక్కువే. దీంతో అమ్మడు ఎప్పుడు ట్రెండింగ్ లోనే ఉంటుంది. కాగా, రీసెంట్ గా యంగ్ హీరో తేజ సజ్జ..అందరికి గుర్తుండే ఉంటాడే.. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిన ఈయన..ఇప్పుడు పెద్ద వాడు అయ్యాడు . హీరో గా కూడా సినిమాలు చేస్తున్నాడు. సమంత తో కలిసి నందిని రెడ్డి డైరెక్షన్ లో ఓ బేబీ అనే సినిమాని కూడా చేశాడు. ఈ సినిమా మంచి పాజిటీవ్ టాక్ ను సొంతం చేసుకుంది.

ఇక ఈ యంగ్ హీరో చాలా చలాకి గల పిల్లోడు. సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్లు పెడుతూ..సరదాగా ఉంటాడు . ఇక రోజులాగే తేజ సరదాగా “తన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. అలాగే ఎక్స్ క్యూజ్ మీ లేడీస్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. సరే అక్కడితో ఊరుకున్నాడా లేదే..ఏకంగా ఓ బేబీ డైరెక్టర్ నందిని రెడ్డిని కూడా ట్యాగ్ చేసాడు. అక్కడే వచ్చింది అసలు చిక్కు. ఇది చూసిన సమంత..వెంటనే తేజ పోస్ట్ కి అద్దిరిపోయే రిప్లై ఇచ్చింది.

సమంత ఏమని రీప్లై ఇచ్చిందంటే.. “అంటే ? ఒక్క సినిమా కోసం.. అంత ఈజీ అనుకున్నావా.. మనం అతనికి ఏమీ నేర్పించలేదా”.. అంటూ డైరెక్తర్ నందిని మీద సీరియస్ అవుతూ సరదాగా కామెంట్ చేసింది. ఇక దీనికి తేజ మళ్ళీ రిప్లై ఇస్తూ ”ఇప్పుడు మీరు నా స్వాగ్ మొత్తం నాశనం చేసారు” అంటూ పాపం ఫీల్ అవుతూ కామెంట్ చేసాడు. ఇదంతా వాళ్ల మధ్య ఉన్న చనువు తో చేసిందని అందరికి తెలిసిందే. ఇక సమంత ఎప్పటికప్పుడు తేజకు తన సపోర్ట్ ఇస్తూనే ఉంటుంది. ఇక ఈ పోస్ట్ తో కూడా తేజ కు మంచి బూస్టప్ ఇచ్చిన్నట్లైంది. వీళ్ల కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.