ఓరి మీ దుంప తెగా..ఇవేమి పనులు రా నాయన..నగ్నంగా నిల్చున్న జబర్దస్థ్ కామెడియన్స్..?

జబర్దస్థ్..తెలుగు టెలివిజన్ చరిత్రలోనే టాప్ టీఆర్పీలు తెచ్చుకుంటూ దూసుకుపోతున్న కామెడీ షో. ఈ కామెడీ షో ద్వారా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడకుండా కాపాడాయి. ఎందరో కమెడీయన్స్ కు లైఫ్ ఇచ్చాయి. ఎంతో మంది టాలెంటేడ్ కమెడీయన్స్ ఇండస్ట్రీకి పరిచయమై మంచి మంచి ఆఫర్లు అందుకుంటూ కెరీర్ లో ముందుకు వెళ్తున్నారు. దీంతో ఈ షో అంటే వాళ్ళకు అపారమైన గౌరవం. ఇది ఓ సైడ్ మాత్రమే. జబర్దస్థ్ షో కి మరో షేడ్ కూడా ఉంది.

వల్గర్ కామెంట్స్..పరోక్షంగా బూతులు పదాలు మాట్లాడం..డబుల్ మీనింగ్ పంచ్ డైలాగ్ లతో కూడా స్కిట్ ని నడిపించే మహా మహా ముదుర్లు ఉన్నారు. ఈ విషయాని చాలా సార్లు ప్రముఖులు మీడియా ముందే చెప్పుకొచ్చారు. జబర్దస్థ్ షో లు మాటలు హద్దులు దాటుతున్నాయని..మరీ దారుణమైన బూతు పదాలు వాడుతున్నారని అవి తగ్గించుకుంటే షో ఇంకా మంచి స్దాయికి వెళ్తుందని చాలా సార్లు పలువురు పెద్దలు..నెటిజన్స్ చెప్పుకొచ్చారు. కానీ ఆ విషయంలో కొందరు టీం లీడర్స్ తగ్గేదేలే అన్నట్లు..ప్రవరిస్తున్నారు. ఇక రీసెంట్ గా అయితే ఓ మెటు దిగి నగ్నంగా స్టేజీ పై నిల్చున్నారు కమెడీయన్స్. దీంతో ఇప్పుడు ఈ మ్యాటర్ హాట్ టాపిక్ గా మారిపోయింది.

రీసెంట్ గా ఈ వారానికి సంబంధించి ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమో ని రిలీజ్ చేశారు జబర్దస్థ్ టీం. ఇక ఈ ప్రోమోలో స్కిట్‌లో భాగంగా సుధీర్ పెళ్లి చేసుకోవాలంటే ఏడు తరాల వాళ్ళని చూడాలి అంటాడు అతని మామ. జనరల్ గా పెళ్లి చేసేటప్పుడు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలి అంటారు గా ఆ లైన్ ను తీసుకోచ్చి స్కిట్ గా మలిచాడు. ఇక ఈ క్రమంలో ఓ తరం వాళ్లు స్టేజీ పైకి నగ్నంగా వచ్చిన్నట్లు మనకు చూయిస్తారు. కంగారు పడకండి..మధ్యలో ఓ గుడ్డను అడ్డుగా పట్టుకున్నారులేండి. అయినా కానీ ఇలాంటి పనులు ఏంటి అంటూ నెటిజన్స్ తిట్టిపోస్తున్నారు. దానికి తోడూ రష్మి వాళ్ళని తొంగి తొంగి చూడటానికి ట్రై చేస్తుంది. దీంతో ప్రోమో ని ఎండ్ చెశారు. ఇక అసలు సినిమా స్కిట్ లో చూయిస్తారనమాట. ఏది ఏమైన టీఆర్పీలు కోసం జబర్దస్థ్ టీ ఇలాంటి స్కిట్స్ వేయడం జనాలకు నచ్చడంలేదు.