పూరికి ఊహించని విధంగా బర్తడే విషెస్ చెప్పిన అభిమాని.. నెట్టింట వైరల్

టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక పూరి జగన్నాథ్ పుట్టినరోజు సందర్భంగా ఇటు సెలబ్రెటీలు, అటు అభిమానులు పూరి జగన్నాథ్ కు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక అభిమాని పూరి జగన్నాథ్ చెప్పిన విషెస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అందులో అభిమాని క్యూబిక్ స్క్వేర్స్ తో పూరి బొమ్మ వచ్చేలా చేసి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.ఆ అభిమాని తెలిపిన ఆ వీడియోని ఛార్మీ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేసింది. ఇది మైండ్ బ్లోయింగ్ చాలా కష్టమైన దీన్ని ఎలా చేశావు చెప్పు అంటూ క్యాప్షన్ ను జోడించింది.

ఆ అభిమాని బర్త్ డే విషెస్ కి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అయితే అంతకుముందు పూరితో కలిసి ఉన్న ఫోటోని పోస్ట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ఇక పూరి జగన్నాథ్ విషయానికి వస్తే ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లైగర్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.