సాధారణంగా హీరోల బర్త్డే అంటే.. వారి వారి అభిమానులు తెగ హంగామా చేస్తుంటారు. ఫ్లెక్సీలు, కటౌట్స్, కేక్ కంటిగ్స్ తో పాటు తమ అభిమాన హీరో బర్త్డే నాడు పాలాభిషేకాలు, అన్నదానాలు, రక్తదానాలు, వస్త్రదానాలు వంటివి సైతం చేస్తారు. అయితే కన్నడ స్టార్ సుదీప్ ఫ్యాన్స్ అభిమానం పేరుతో అరాచకం చేశారు.
సుదీప్ బర్త్ డే(సెప్టెంబర్ 2) సెలబ్రేషన్స్ కర్ణాటక వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తన పుట్టిన రోజుని ఎవరూ సెలెబ్రేట్ చేయవద్దు.. మీ ఆశీస్సులు చాలు అని సుదీప్ అభిమానులని కోరాడు. అయినప్పటికీ, కొందరు ఫ్యాన్స్ రెచ్చిపోయి ప్రవర్తించారు. బళ్లారి జిల్లాలోని సండూరి తాలూక్ బండ్రి వద్ద సుదీప్ ఫ్లెక్సీ ముందు ఫ్యాన్స్ అంతా బహిరంగంగా చేరి ఏకంగా దున్నపోతును బలిచ్చేశారు.
దాంతో ఈ విషయం స్థానికంగా కలకలం రేపుతోంది. మరోవైపు సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు, జంతు సంరక్షణ సంఘాలు సైతం సుదీప్ అభిమానులపై మండిపడుతున్నారు. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు.. సద్భావన పేరుతో జీవ హింస చేసిన సుదీప్ అభిమానులపై కేసు నమోదు చేశారు.