ఆ హీరోతో బ‌స్సులో ప్ర‌యాణిస్తున్న స‌మంత‌, న‌య‌న్‌..వీడియో వైర‌ల్‌!

కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తితో అక్కినేని వారి కోడలు స‌మంత‌, లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార బ‌స్సులో ప్ర‌యాణం చేశారు. కోట్లు ఖ‌రీదు చేసే కార్లు ఉండ‌గా.. వీరు బ‌స్సులో వెళ్ల‌డం ఏంటీ అని అనుకుంటున్నారా..? అది తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే.

Watch: Nayanthara, Samantha, Vijay Sethupathi recreate Kamal-Amala's  'Valayosai' song | The News Minute

విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వంలో విజ‌య్ సేతుప‌తి, న‌య‌న‌తార‌, స‌మంత కీల‌క పాత్ర‌ల్లో తెర‌కెక్కుతున్న తమిళ చిత్రం `కాతువాకుల రెండు కాదల్‌`. ఈ చిత్ర షూటింగ్‌ తాజా షెడ్యూల్‌ పాండిచ్చేరిలో జరుగుతోంది. షూటింగ్‌లో ముగ్గురు తార‌లు పాల్గొంటున్నారు. వీరి ముగ్గురిపై కొన్ని కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఇందులో భాగంగానే ఓ సీన్‌లో రియాల్టీ ఉండటం కోసం ప్రభుత్వ బస్సులో జనం అంతా ఉండగానే షూటింగ్ చేశారు.

Vijay Sethupathy, Nayanthara and Samantha recreating Kamal Haasan's famous  song in 'Kaathu Vaakula Rendu Kaadhal'! - Shooting spot video goes viral -  Tamil News - IndiaGlitz.com

అయితే ఈ సీజ‌న్‌కు సంబంధించిన వీడియో లీకై.. నెట్టింట వైర‌ల్‌గా మారింది. బస్సు ప్రయాణం చేస్తున్న సమంత, నయనతార, విజయ్ సేతుపతి ఫుట్‌బోర్డ్‌పై నిలబడ్డారు. తెల్ల చీరలో సమంత, నయనతార కనిపిస్తుండగా, విజయ్‌ సేతుపతి వైట్‌ షర్ట్‌, బ్లాక్ ప్యాంటు ధరించి ఉండటాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. కాగా, సమంత, నయనతార, విజయ్ సేతుపతిల చుట్టూ తిరిగే ట్రయాంగిల్ ల‌వ్‌స్టోరీ అని తెలుస్తోంది.

https://twitter.com/seldicap17/status/1429684996176896001?s=20