టాలీవుడ్ లో రాంగోపాల్ వర్మ విభిన్నమైన దర్శకులలో ఒకరు. రాంగోపాల్ వర్మ ఒకానొక సమయంలో సాధారణ హీరోలను స్టార్ హీరోలుగా మార్చేశాడు. ఇక అంతే కాకుండా అప్పట్లో మాస్ సినిమాలకు రాంగోపాల్ వర్మ పెట్టింది పేరు . ఇక ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈయన నటులతో కాలక్షేపాలు చేస్తూ ఉన్నాడు. అయితే తన పాపులారిటీ కోసం ఆషు రెడ్డి, రాంగోపాల్ వర్మ తో మాట్లాడడానికి వెళ్లిన చోట కొన్ని ఫొటోలు వైరల్ గా మారాయి..ఇక వాటి వివరాలను చూద్దాం.
బుల్లితెరపై ఆశు రెడ్డి అంటే అందరికీ సుపరిచితమే. ఈమె సోషల్ మీడియా ద్వారా తనకంటూ కొంత మంది ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. అలా సంపాదించుకున్న వాటిలోనే బుల్లితెరపై బిగ్ బాస్- సీజన్ 3 లో పాల్గొన్నది ఈ అమ్మడు. ఇక అంతే కాకుండా ఈ మధ్యకాలంలో మా టీవీలో ప్రసారమయ్యే ఒక షోలో కూడా ఈమె కనిపిస్తూ ఉంది.
ఇక రాంగోపాల్ వర్మ ను తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళిన ఆశు రెడ్డి. తన తో దిగిన కొన్ని ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడం ద్వారా.. ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు, ఆమె రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లినట్లు లేదు.. అని కామెంట్ చేస్తున్నారు. వీరు చేస్తున్నటువంటి పని వల్ల రాంగోపాల్ వర్మ, అరియానా చేసిన తీరు గుర్తుకొచ్చినట్లు కామెంట్స్ చేస్తున్నారట నెటిజన్లు.
ఈమె ఇదంతా కేవలం పాపులారిటీ సంపాదించుకోవడం కొరకు మాత్రమే చేసినట్లు మరికొంత మంది అనుకుంటున్నారు. ఇక ఈ వీడియో చూసిన వారందరూ రామ్ గోపాల్ వర్మ, తన హీరోయిన్లను ఎలాంటి యాంగిల్ లో చూపిస్తారో..? ఎలాంటి యాంగిల్ లో ఒక ఫోటో ని పోస్ట్ చేస్తారో అంటూ కామెంట్ చేస్తున్నారు.