బాలయ్య తో పోటీపడుతున్న అల్లు అర్జున్..?

టాలీవుడ్ లో పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలు పోటి పడి విడుదల చేయడం ఎప్పట్నుంచో వస్తూనే ఉంది. అయితే ఇప్పుడు కరోనా తర్వాత, పెద్ద సినిమాలు కూడా పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సంక్రాంతి బరిలో స్టార్ హీరోల సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఇక దసరా బరిలో ఆచార్య విడుదలవుతుండగా, క్రిస్మస్ సందర్భంగా అఖండ మూవీ ని విడుదల చేయబోతున్నట్లు సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తోంది.

అఖండ మూవీ అత్యధిక భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న చిత్రం ఇది. ఇక ఈ సినిమాని డిసెంబర్ లో వదిలితే బాలకృష్ణ కచ్చితంగా హిట్ కొడతాడని సినిమా యూనిట్ మేకర్స్ నమ్ముతున్నారని సమాచారం. ఇక అంతే కాకుండా బాలకృష్ణ ఇందులో ద్విపాత్రాభినయం లో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఇక బాలకృష్ణ కూడా ఈ సినిమాను డిసెంబర్ లో విడుదల చేసేందుకు ఒప్పుకుంటే, ఆ సమయంలో బన్నీ సినిమా కూడా విడుదల అవుతున్నట్లు సమాచారం. అయితే వీరిద్దరి సినిమాలు కూడా ఒకేసారి విడుదల అవడం చేత కలెక్షన్ల మీద చాలా ప్రభావం చూపుతుంది.

ఇక డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో మూడో సినిమా ఇది. ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు డైరెక్టర్ అలాగే బాలకృష్ణ. ఇక అంతే కాకుండా లీడర్లను పోస్ట్ ఫోన్ చేస్తుంటే ఆర్ ఆర్ ఆర్ , సర్కారు వారి పాట, భీమ్లానాయక్ వంటి సినిమాలు వస్తాయని అందుచేత ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేయాలి అనే సందిగ్ధంలో ఉన్నారు చిత్ర యూనిట్. అయితే ఈ సినిమా ని ఎప్పుడు విడుదల చేస్తారని బాలకృష్ణ అభిమానులు ఎదురుచూస్తున్నారు. బాలకృష్ణ ఒప్పుకుంటే ఈ సినిమాని డిసెంబర్లో విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.