ప్రస్తుతం బాలీవుడ్‌ను రాజ్ కుంద్రా అశ్లీల వీడియోల వ్యవహారం ఓ కుదుపు కుదిపేస్తోంది. ప్రముఖ నటి శిల్పా శెట్టికి భర్తగా ఉన్న రాజ్ కుంద్రా ఇప్పటి వరకు ఏవేవో పెద్ద పెద్ద బిజినెస్‌లు చేసేవాడని అందరూ అనుకున్నారు. అయితే రాజ్ కుంద్రాలో ఇలాంటి చీకటి కోణాలు ఉన్నాయన్న సందేహాలు ఎవ్వరికి లేవు. అయితే కొద్ది రోజులుగా ఆయన పోర్న్ వీడియోలు తీసి యాప్‌ల లో అప్డేట్ చేస్తున్నాడన్న సమాచారం మేరకు ముంబై పోలీసులు చేసిన దాడుల్లో ఈ గుట్టు అంతా రట్టు అయ్యింది. ఈ క్రమంలోనే రాజ్ కుంద్రాను పోలీసులు అదుపులోకి తీసుకుని పలు విషయాలు రాబడుతున్నారు.
మరోవైపు శిల్పా శెట్టి నుంచి కూడా పలు కీలక విషయాలు రాబట్టినట్టు టాక్ వస్తోంది. ఇదిలా ఉంటే రాజ్ కుంద్రా వ్యవహారంలో దేశ వ్యాప్తంగా ఉన్న పలువురు సినీ ప్రముఖులు ఎవరికి తోచిన అభిప్రాయాలు వారు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే 1990వ దశకంలో బాలీవుడ్లో హాట్ నటిగా పేరున్న సోమీ ఆలీ రాజ్ కుంద్రా వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలతో దుమారం రేపారు. కామసూత్ర పుట్టిన భారత్‌లో అశ్లీలంపై నిషేధం విధించడం కరెక్టేనా ? అని ఆమె ప్రశ్నించారు.
అశ్లీం అనేది కూడా ఓ కళారూపమే అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. నీలి చిత్రాలకు మద్దతుగా మాట్లాడిన సోమీ ఆలీ గతంలో సల్మాన్ సైఫ్ అలీఖాన్ , సంజయ్ దత్ తదితర పెద్దస్టార్ల సరసన హీరోయిన్గా చేశారు. ప్రస్తుతం అమెరికాలో సెటిల్ అయిన ఆమె సామాజిక సేవా కార్యక్రమాల్లో బిజీ అయ్యారు. రాజ్ కుంద్రా వ్యవహారంపై సోమీ ఆలీ స్పందిస్తూ లైంగిక అక్రమ రవాణా జరగనంత వరకు ఎవరైనా అశ్లీలతను తమ వృత్తిగా ఎంచుకుంటే తప్పులేదని ఆమె తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏదేమైనా సోమీ ఆలీ వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతున్నాయి.