తాప్సీ పన్ను.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఝుమ్మంది నాదం సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్లో అడుగు పెట్టింది తాప్సీ. మొదటి సినిమాతోనే మంచి నటిగా మార్కులు కొట్టేసిన ఈ భామ.. ఆ తర్వాత అడపా తడపా సినిమాలు చేసి బాలీవుడ్‌కు మాకాం మార్చేసింది.
ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు దూరమై బాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న ఈ భామ.. సోదరి షాగున్‌తో కలిసి రష్యాలో టూర్ చేస్తోంది. వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్న తాప్సీ.. అక్కడ అన్ని నగరాలను చుట్టేస్తోంది.
తాజాగా సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ఓ డిన్నర్‌కు అటెండ్ అయ్యింది ఆ బ్యూటీ. స్పెషల్ సారీలో తాప్సీ ఆ పార్టీకి వెళ్లింది. చేతికి గాజులు, సన్‌గ్లాసెస్‌తో తెగ హడావుడిగా రోడ్డుపై పరుగు తీస్తున్న ఓ ఫోటోను తన ఇన్‌స్టాలో పోస్టు చేసింది. ఈ ఫొటో చూస్తుంటే.. అమ్మడు రష్యాలో పిచ్చ చిల్ అవుతున్నట్టు కనిపిస్తోంది.
https://www.instagram.com/p/CQY2fT4p4w9/?utm_source=ig_web_copy_link