మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈ అమ్మడు ఇండస్ట్రీలో అడుగు పెట్టి పదిహేను సంవత్సరాలు గడిచిపోయినా.. ఇంకా స్టార్ హీరోయిన్‌గానే దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ గ్లామర్ బ్యూటీ తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం భాషలలో కూడా నటిస్తూ సత్తా చాటుతోంది.
ఓ మ్యాగజైన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో.. మీరు మీ ముఖ సౌందర్యం కోసం వేసుకునే స్పెషల్ ఫేస్ ప్యాక్ ఏంటి అని ప్రశ్న వేయగా..ఉదయాన్నే లేచిన తర్వాత తన లాలాజాలం(సలైవా)ను ముఖానికి అప్లై చేస్తానని చెప్పి అందరికి షాక్ ఇచ్చింది తమన్నా. ఉమ్మిని ముఖానికి రాసుకోవడం ఏంటీ? విడ్డూరంగా ఉందే.. అనుకుంటున్నారు కదూ!. అలా అనిపించడం సహజమే.
అందుకే ఈ విషయంలోనే మరింత క్లారిటీ ఇచ్చింది మిల్కీ బ్యూటీ. సెలైవాలో పింపుల్స్‌ను పొగొట్టే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ క్వాలిటీస్ చాలా ఉంటాయని.. అందుకే తన బ్యూటీ ట్రీట్మెంట్స్లో సెలైవా కూడా ఓ పార్టే అని చెప్పుకొచ్చింది తమన్నా. ఏదేమైనప్పటికీ తమన్నా బ్యూటీ టిప్ మాత్రం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.