పెళ్లి పీట‌లెక్క‌బోతున్న‌ జబర్దస్త్ వర్ష..డేట్ ఫిక్స్‌!?

ప‌లు సీరియ‌ల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న న‌టి వ‌ర్ష‌.. పాపుల‌ర్ కామెడీ షో జబర్దస్త్‌ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. మ‌రోవైపు అందాల ఆర‌బోత‌లోనూ ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌కుండా.. హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో సెగ‌లు రేపుతోంది.

ఇదిలా ఉంటే.. వ‌ర్ష త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్క‌బోతోందంటూ జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. తాజాగా వ‌ర్ష‌ తన ఇన్స్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసిన ఫొటోలే ఈ ప్ర‌చారానికి కార‌ణం. జూలై 4వ బిగ్ అనౌన్స్‌మెంట్ ఇవ్వబోతున్నా అంటూ డేట్ ఫిక్స్ చేసిన వ‌ర్ష‌..తన చేతికి పెట్టుకున్న ఉంగరాన్ని చూపించింది. అంతటితో ఆగక మంగళసూత్రాన్ని చూపిస్తూ వరుడు, వధువు ఉన్న పిక్ షేర్ చేసి ఆశ్చర్యపర్చింది.

దీంతో వ‌ర్ష చెప్ప‌బోయేది త‌న పెళ్లి మ్యాట‌రే అని అంద‌రూ ఫిక్స్ అయిపోయారు. పైగా రింగ్ ఫోటో ఉండేసరికి నిశ్చితార్థం కూడా అయిపోయిందని అనుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే వరుడు ఎవరు వర్ష, ఎప్పుడు పెళ్లి అంటూ కామెంట్ల‌తో నెటిజ‌న్లు హోరెత్తిస్తున్నారు. మ‌రి అది తెలియాలంటే జూలై 4 వ‌ర‌కు ఆగాల్సిందే.

Varsha Marriage